Modi Trump news: ప్రధాని మోదీతో ఫోన్ కాల్.. అమెరికా అధ్యక్షుడి మాటలను తోసిపుచ్చిన భారత్..
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:08 PM
రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తనతో ఫోన్‌లో మాట్లాడారని కూడా ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది.
రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తనతో ఫోన్‌లో మాట్లాడారని కూడా ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. బుధవారం ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణా జరగలేదని ప్రభుత్వం గురువారం తెలిపింది (Trump India phone call).
గురువారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బుధవారం ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ కాల్ జరగలేదని స్పష్టం చేసింది. బుధవారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో మాస్కోను ఒంటరిగా చేయడానికి ఇది పెద్ద అడుగు అని ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలను అటు భారత విదేశాంగ శాఖ, రష్యా కూడా ఖండించాయి (India rejects Trump claim).
ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలకే భారత్ తొలి ప్రాధాన్యం ఇస్తుందని, తమ దిగుమతి విధానాలు ఆ లక్ష్యం మేరకే ఉంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు (Indian government statement). అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. మరోవైపు రష్యా విదేశాంగ శాఖ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు ఎంతో ముఖ్యమని, డిస్కౌంట్ ద్వారా పొందుతున్న చమురు వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. భారత్ ర్యాంకు ఎంతంటే..