Diwali surprise: ఉదయం ఆఫీస్‌కు వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:49 PM
దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి పోటీ పడుతున్నాయి. కొందరు బోనస్‌లను అందిస్తే, మరికొందరు దీపావళి బహుమతులతో ఉద్యోగులను సంతోషపరుస్తున్నారు.
దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను సంతోషపెట్టడానికి పోటీ పడుతున్నాయి. కొందరు బోనస్‌లను అందిస్తే, మరికొందరు దీపావళి బహుమతులతో ఉద్యోగులను సంతోషపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్పొరేట్ కంపెనీ అందించిన బహుమతులు దాని ఉద్యోగులను ఆశ్చర్యపరిచాయి. సదరు కంపెనీ సోషల్ మీడియాలో ప్రశంసలను కూడా పొందుతోంది. (Diwali gifts viral video).
ఈ వైరల్ వీడియో ఒక కార్పొరేట్ కంపెనీకి చెందినదిగా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆఫీస్‌లో ఉద్యోగుల సీట్లపై బహుమతులతో కూడిన ట్రాలీ బ్యాగులను చూడవచ్చు. కంపెనీ ప్రతి ఉద్యోగి సీటుపై దీపావళి బహుమతులను ఉంచింది. వాటితో పాటు ఓ స్వీట్ ప్యాకెట్‌ను కూడా ఇచ్చింది. ఉద్యోగులు ఉదయం ఆఫీస్‌కు వచ్చే ముందే బహుమతులు వారి సీట్లపై ఉంచి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వీడియోను @itsmeee_arushi అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు (Diwali 2025 gifts).
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది (employee benefits). ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు కోట్ల మంది వీక్షించారు. 6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. సదరు కంపెనీ యాజమాన్యంపై ప్రశంసలు కురిపించారు. నాకు ఆ ఆఫీస్‌లో జాయిన్ కావాలని ఉందని ఒకరు కామెంట్ చేశారు. దీపావళి సందర్భంగా తమ కంపెనీ ఉద్యోగులను తొలగించిందని ఒకరు పేర్కొన్నారు. ఆ కంపెనీలో ఖాళీలు ఉంటే తనకు చెప్పాలని మరొకరు అడిగారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..
మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోలో ఏనుగు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..