Comedian Kapil Sharmas Cafe: కమెడియన్ కపిల్ శర్మకు దెబ్బ మీద దెబ్బ.. మరోసారి రెస్టారెంట్‌పై కాల్పులు..
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:00 PM
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులైన గ్యాంగ్‌స్టర్ గోల్డీ దిల్లాన్, కుల్దీప్ సిద్దు ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కుల్దీప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కెనడాలో ‘కప్స్ కేఫ్’ పేరిట ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రెస్టారెంట్‌ను లారెన్స్ బిష్ణోయ్ క్రిమినల్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. గ్యాంగ్ సభ్యులు గత కొన్ని నెలల నుంచి రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. బుధవారం కూడా రెస్టారెంట్‌పై కాల్పులు జరిగాయి. నాలుగు నెలల వ్యవధిలో ఇది మూడో సారి.
కారులో రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన దుండగులు తుపాకితో కాల్పులకు తెగబడుతున్నారు. అది కూడా రాత్రి వేళల్లోనే కాల్పులు జరుపుతున్నారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులైన గ్యాంగ్‌స్టర్ గోల్డీ దిల్లాన్, కుల్దీప్ సిద్దు ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కుల్దీప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో..
‘కప్స్ కేఫ్‌పై జరిగిన మూడు దాడులకు నేను, గోల్డీ దిల్లాన్ బాధ్యత వహిస్తున్నాం. మాకు ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదు. మాతో శత్రుత్వం ఉన్న వ్యక్తులు మాకు చాలా దూరంగా ఉండాలి. తప్పుడు పనులు చేస్తూ, ప్రజలకు డబ్బులు ఇవ్వని వారు సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్‌లో మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్లెట్లు ఏ వైపునుంచైనా రావచ్చు’ అని వార్నింగ్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఉదయం ఆఫీస్‌కు వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..
ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది.. తండ్రి ఒడిలోని బిడ్డను..