Car Airbag Takes Boy Life: ఎయిర్ బ్యాగ్ ప్రాణం తీసింది.. తండ్రి ఒడిలోనే బిడ్డ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:30 PM
వీరముత్తు భార్య కారు వెనక సీట్లో కూర్చుంది. విగ్నేష్ పక్కన వీరముత్తు కూర్చున్నాడు. కెవిన్ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది.
మనుషుల ప్రాణాలు కాపాడటానికి డిజైన్ చేసిన కార్ల ఎయిర్ బ్యాగ్స్ కొన్ని సందర్భాల్లో ఊహించని విషాదాలకు దారి తీస్తున్నాయి. అనుకోని విధంగా ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, ఓ ఏడేళ్ల బాలుడు ఎయిర్ బ్యాగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి ఒడిలోనే తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కల్పాక్కమ్ పుదుపట్టినం గ్రామానికి చెందిన వీరముత్తు తన భార్య, ఏడేళ్ల కుమారుడు కెవిన్‌తో కలిసి కారులో చెన్నై బయలు దేరాడు. డ్రైవర్ విగ్నేష్ కారు నడుపుతూ ఉన్నాడు. వీరముత్తు భార్య వెనుక సీట్లో కూర్చుంది. విగ్నేష్ పక్కన వీరముత్తు కూర్చున్నాడు. కెవిన్ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది.
వీరి కారు తిరుపోరూర్ దగ్గర వేరే కారును ఢీకొట్టింది. దీంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓ ఎయిర్ బ్యాగ్ తండ్రి ఒడిలో కూర్చున్న కెవిన్ శరీరాన్ని బలంగా తాకింది. బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. అయినప్పటికీ అక్కడికక్కడే చనిపోయాడు. కారులోని మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సురేష్ ఇండికేటర్ వేయకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కెవిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
చెట్టుపై సింహంతో చిరుత పోరాటం.. కిందపడిన తర్వాత చిరుత ట్యాలెంట్ చూస్తే..
రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు