Lion vs Leopard: చెట్టుపై సింహంతో చిరుత పోరాటం.. కిందపడిన తర్వాత చిరుత ట్యాలెంట్ చూస్తే..
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:29 PM
క్రూర మృగాల పోరాటం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సింహం, పులి, చిరుత వంటి క్రూర మృగాల మధ్య ఫైట్ జరిగితే ఏది గెలుస్తుందనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. సాధారణంగా సింహం నేల మీద అత్యంత బలమైనది.
క్రూర మృగాల పోరాటం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సింహం, పులి, చిరుత వంటి క్రూర మృగాల మధ్య ఫైట్ జరిగితే ఏది గెలుస్తుందనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. సాధారణంగా సింహం నేల మీద అత్యంత బలమైనది. అది చెట్లు ఎక్కడం అనేది ఊహకు అందని విషయం. మరోవైపు చిరుత ఎలాంటి చెట్టునైనా ఎక్కగలదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ చెట్టు మీద సింహం, చిరుత ఫైట్ చేసుకున్నాయి (wild animal fight).
@AMAZlNGNATURE అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సింహం ఓ భారీ చెట్టు ఎక్కి చిరుత పులితో పోరాటానికి దిగింది. రెండూ ఒకే కొమ్మ మీద నిల్చుని గొడవపడుతున్నాయి. రెండు భారీ మృగాల తాకిడికి ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది. కొమ్మతో పాటు ఆ రెండు జంతువులు కూడా కింద పడిపోయాయి. కింద పడిన వెంటనే చిరుత బంతిలా పైకి తూలి అక్కడి నుంచి పారిపోయింది. సింహం తేరుకోవడానికి మాత్రం కాస్త సమయం పట్టింది (lion leopard fight video).
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (forest drama). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 45 లక్షల మంది వీక్షించారు. 18 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోలోని చిరుత పులిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సింహం అంత పైకి ఎక్కడం గొప్ప విషయం అని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..
మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోలో ఏనుగు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..