Share News

AB De Villiers: బొద్దింకల్లా రోహిత్, కోహ్లీల నాశనం కోరుకున్నారు: డివిలియర్స్

ABN , Publish Date - Oct 28 , 2025 | 08:04 AM

టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు.

AB De Villiers: బొద్దింకల్లా  రోహిత్, కోహ్లీల నాశనం కోరుకున్నారు: డివిలియర్స్
AB de Villiers

క్రీడా వార్తలు: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటపై ఇటీవల కొందరు విమర్శలు చేస్తున్నారు. రో-కోలు విఫలమవుతున్నా..వారిని ఇంకా ఎందుకు ఆటలో కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వారి నోర్లు మూయించేలా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని, అందుకే పలు రకాల విమర్శలు చేస్తున్నారని డివిలియర్స్ తెలిపాడు. ఈ ఇద్దరిపై అనవసరమైన నెగటివిటీని క్రియేట్ చేస్తూ విమర్శలు గుప్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఏబీ డివిలియర్స్(AB de Villiers YouTube).. రోహిత్, కోహ్లీలపై వచ్చే ఈ విమర్శలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.


'జనం ఏం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అసలు వారిని మనుషులు(Rohit Kohli critics) అని పిలవచ్చో లేదో కూడా తెలియదు. క్రీడాకారులు తమ కెరీర్ చివరి దశకు చేరుకోగానే.. వీళ్లు బొద్దింకల్లా బొక్కల్లో నుంచి బయటకు వచ్చినట్లు వచ్చి విమర్శలు గుప్పిస్తారు. దేశం కోసం, క్రికెట్ కోసం తమ జీవితాన్ని ధారపోసిన ఆటగాళ్లపై ఎందుకు ఇంత నెగటివిటీని(negativity) పెంచుతారు? వారిని గౌరవించుకోవడానికి ఇదే సరైన సమయం అనే విషయాన్ని మర్చిపోతున్నారు.


గత కొద్ది నెలలుగా కొందరు కోహ్లీ(Virat Kohli), రోహిత్‌లను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. నేను ఆ కొందరి గురించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ఎందుకంటే మెజార్టీ జనం రోహిత్, విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టపడతారు. వారి అద్భుతమైన కెరీర్‌ను ప్రశంసిస్తుంటారు. వారి సక్సెస్‌ను వీరి విజయంలా సంబరాలు చేసుకుంటారు. అలా రోహిత్(Rohit Sharma), కోహ్లిలను అభిమానించే వారు.. వారిద్దరిని సక్సెస్‌ను మరోసారి సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం' అని ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

Updated Date - Oct 28 , 2025 | 08:04 AM