Australia Tour 2025: శ్రేయాస్‌కు తీవ్ర గాయం
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:12 AM
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకుని కింద పడే క్రమంలో అతడి ఎడమ మోచేయి పక్కటెముకలకు...
ప్లీహంలో అంతర్గత రక్తస్రావం
ఐసీయూలో చికిత్స, అనంతరం ప్రత్యేక వార్డుకు తరలింపు
సిడ్నీ ఆస్పత్రిలో అయ్యర్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకుని కింద పడే క్రమంలో అతడి ఎడమ మోచేయి పక్కటెముకలకు బలంగా తాకింది. దీంతో విపరీతమైన నొప్పితో విలవిల్లాడిన శ్రేయాస్ మైదానం వీడాడు. మెరుగైన చికిత్స కోసం వెంటనే అయ్యర్‌ను ఆస్పత్రికి తరలించారు. ‘స్కానింగ్ పరీక్షలో పక్కటెముకల వద్ద ప్లీహానికి తీవ్రగాయమై, అంతర్గతంగా రక్తస్రావమైనట్టు కూడా తేలింది. పరిస్థితి విషమించకముందే తనను ఐసీయూలో చేర్చాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పాటు వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం కూడా శ్రేయాస్ గాయంపై సిడ్నీ, భారత్‌లోని స్పెషలి్‌స్టలను నిరంతరం సంప్రదిస్తోంది. టీమ్ డాక్టర్ కూడా శ్రేయా్‌సతో పాటు సిడ్నీ ఆస్పత్రిలోనే ఉండి రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తున్నాడు. వారం రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలి’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు శ్రేయాస్ ఆరోగ్యంలో పురోగతి కనిపించడంతో సోమవారం అతడిని ఐసీయూ నుంచి డిశ్చార్జి చేసి ప్రత్యేక వార్డుకు మార్చినట్టు సమాచారం.
ఆలస్యం అయ్యుంటే..?
శ్రేయాస్ గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేసిన బీసీసీఐ వైద్య బృందం అతడిని పెనుప్రమాదం నుంచి తప్పించింది. లేకుంటే పరిస్థితి విషమంగా మారేది. మైదానం నుంచి పెవిలియన్‌కు రాగానే అయ్యర్ గాయాన్ని మెడికల్ సిబ్బంది, ఫిజియో పరిశీలించారు. అంతలోనే అతను స్పృహ కోల్పోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించారు. లేనిపక్షంలో క్రికెటర్ ప్రాణాల మీదికి వచ్చివుండేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. రక్తస్రావం ఆగకపోతే ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఐసీయూలోనే రెండు రోజుల పాటు ఉంచారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న శ్రేయా్‌సకు అండగా సిడ్నీలోని అతడి స్నేహితులు ఆస్పత్రిలోనే ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు సైతం వీసా ప్రక్రియ పూర్తికాగానే ఆస్ర్టేలియాకు పయనం కానున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే అయ్యర్‌ను భారత్‌కు పంపాలనే ఆలోచనలో బోర్డు ఉంది.

బరిలోకి ఎప్పుడో?
వన్డే జట్టులో మాత్రమే ఉన్న శ్రేయాస్ అయ్యర్ తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడనే సందేహాలు నెలకొన్నాయి. ప్రాథమికంగా శ్రేయాస్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరముంటుందని భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో తను బ్యాట్ పట్టేందుకు మరింత సమయం పట్టవచ్చని సమాచారం. నవంబరు 30 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఉంది. అప్పటి వరకు కోలుకుంటాడా? అనేది చెప్పలేం. మరోవైపు భారత్‌కు వచ్చాక నేరుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ)లో చేరనున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News