Share News

UP: భార్య నమ్మకద్రోహాన్ని సహించలేక భర్త ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:31 AM

Uttar Pradesh: భార్య నిజస్వరూపం బట్టబయలు కావడంతో ఆగ్రహం అణచుకోలేపోయాడు భర్త. ఆవేశంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

UP: భార్య నమ్మకద్రోహాన్ని సహించలేక భర్త ఏం చేశాడంటే..
Man bites off wife nose in UP

UP man bites wife nose: భార్యపై అనుమానం వచ్చి ఆమెను రహస్యంగా ఫాలో చేస్తూ వెళ్లాడు భర్త. అది గమనించుకోని భార్య ఎప్పట్లాగే ప్రియుడి ఇంటికి చేరుకుంది. కళ్లెదుటే జీవిత భాగస్వామి బండారం బయట పడటంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తనకు తెలియకుండా ఇన్నాళ్లూ సీక్రెట్ గా ప్రియుడితో అఫైర్ నడుపుతున్న భార్యతో వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి అతడి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆమె ముక్కును కొరికేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హర్దోయ్ జిల్లాలోని గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ బుధవారం ప్రేమికుడిని కలవడానికి వెళ్లింది. అనుమానంతో భర్త రామ్ ఖిలావన్ ఆమెను వెంబడిస్తూ వెళ్లాడు. చూస్తుండగానే భార్య ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అతడితో చనువుగా మెలగడం గమనించాడు. ఈ దృశ్యం చూడగానే రామ్ ఖిలావన్ హతాశుడయ్యాడు. ఆగ్రహం పట్టలేకపోయాడు. వెంటనే ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన భార్యను నిలదీశాడు. ఇద్దరి మధ్య తీవ్ర కలహం చెలరేగింది. కోపం పట్టలేక ప్రియుడు చూస్తుండగానే భార్య ముక్కును కసిగా కొరికేశాడు. బాధతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోగయ్యారు. జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం అందించారు.


ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్న మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా వైద్యులు ఆమెను అధునాతన చికిత్స కోసం లక్నోలోని ఒక వైద్య కేంద్రానికి పంపించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Viral News: హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..

ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 10:19 AM