UK Woman VandeBharat: వందే భారత్ రైల్లో ప్రయాణం.. యూకే మహిళ ప్రశంసలు వైరల్
ABN , Publish Date - May 06 , 2025 | 10:39 PM
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం అద్భుతమంటూ ఓ మహిళ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణ సౌకర్యంలో వందేభారత్ రైళ్లు ఇతర సాధారణ రైళ్లతో పోలిస్తే ఎంతో మెరుగు. అయితే, ఈ రైల్లో తాజాగా ప్రయాణించిన ఓ యూకే మహిళ ఇందులోని సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయింది. ఈ ప్రయాణం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించింది. దాదాపు 8 గంటల పాటు రైల్లో ప్రయాణించిన ఆమె ఆ విశేషాలను వీడియో రూపంలో నెట్టింట పంచుకుంది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
‘‘ముంబై నుంచి గోవాకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నీ. భారత్‌లో ఉన్న రైళ్లల్లో ఇదే బెస్ట్. ఫస్ట్ క్లాస్ టిక్కెట్ తీసుకుని బయలుదేరా. 31.57 పౌండ్లు చెల్లించా. ఇక్కడి రేట్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే కానీ ఇతర రైళ్లతో పోలిస్తే ఇందులో ప్రయాణానుభవం అద్భుతంగా ఉంది’’
‘‘బ్రేక్ ఫాస్ట్, కాఫీ, న్యూస్ పేపర్లు.. అబ్బో అన్ని ఇచ్చారు. సౌకర్యవంతంగా జర్నీ చేసేందుకు వీలుగా ఓ రైల్లో ఇంత జాగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సీట్లను కిటికీ వైపు తిప్పుకుని కూర్చుని జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. వానాకాలంలో ఈ జర్నీ మరింత బాగుంటుంది. కానీ సమయం ఎక్కువ పడుతుంది’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
తాను గోవా ట్రిప్ కోసం విస్టాడోమ్‌లో టిక్కెట్ బుక్ చేసుకుందామనుకున్నా డిమాండ్ అధికంగా ఉండటంతో కుదరలేదని ఆమె తెలిపింది. అయితే, వందేభారత్ జర్నీ కూడా తనకు అద్భుత అనుభవాన్నే మిగిల్చిందని పేర్కొంది.
ఇలా వందేభారత్ ప్రయాణాన్ని మెచ్చుకుంటూ ఆమె షేర్ చేసిన వీడియోకు భారీగా వ్యూ్స్ వచ్చాయి. నిజాయతీగా తన మనసులో మాటను పంచుకున్నందుకు ఆమెపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. నిత్యం భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు వ్లాగర్స్‌తో పోలిస్తే ఈమె చాలా బెటరని చెప్పుకొచ్చారు. భారత్‌కు ఉన్న మరో కోణాన్ని ఆమె ప్రపంచదేశాలకు పరిచయం చేసిందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ, వారణాసి మధ్య తొలి రైలు సర్వీసును నిర్వహించారు. ఈ సెమీ హైస్పీడు రైలు గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 68 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..