Viral Video: బ్రెయిన్ మోకాలులో ఉండడం అంటే ఇదేనేమో.. దొంగ బ్యాగ్ దొంగిలిస్తే ఆమె ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:18 PM
చాలా మంది ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనపుడు వెంటనే ఎలా స్పందించాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. సరిగ్గా రియాక్ట్ కాలేక తీవ్రంగా నష్టపోతుంటారు. తాజాగా ఓ యువతికి అలాంటి సమస్యే ఎదురైంది. అయితే ఆ యువతి అమాయకంగా వ్యవహరించి తన బ్యాగ్ పోగొట్టుకుంది.

మన దేశంలో తెలివైన వాళ్లు ఎంత మంది ఉన్నారో, అమాయకులు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురైనపుడు వెంటనే ఎలా స్పందించాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. సరిగ్గా రియాక్ట్ కాలేక తీవ్రంగా నష్టపోతుంటారు. తాజాగా ఓ యువతికి అలాంటి సమస్యే ఎదురైంది. అయితే ఆ యువతి అమాయకంగా వ్యవహరించి తన బ్యాగ్ (Bag) పోగొట్టుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@Siimplymee1234 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి స్కూటీ మీద వెళ్తూ రోడ్డు పక్కన ఆగింది. ఆమె భుజానికి బ్యాగ్ ఉంది. అంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద అక్కడకు వచ్చారు. ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకుని బైక్ మీద వెళ్లిపోయారు. షాకైన యువతి తన స్కూటీకి స్టాండ్ వేసి కిందకు వారి వెనుక పరిగెత్తింది. స్కూటీ మీద వెంబడించడం కాకుండా దానిని పార్క్ చేసి పరిగెత్తి పట్టుకోవాలనుకున్న యువతి బ్రెయిన్‌పై చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.4 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``బ్రెయిన్ మోకాలులో ఉండడం అంటే ఇదే``, ``ఆమె తన దగ్గర స్కూటీ ఉందని మర్చిపోయినట్టు ఉంది``, ``షాక్‌లో ఆమె బ్రెయిన్ పని చేయలేదు``, ``ఆమె స్కూటీ కంటే వేగంగా పరిగెత్తగలదేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: దేశంలో తెలివైన వాళ్లకు కొదవ లేదు.. కార్ అద్దం పగిలిపోవడంతో ఎలా సెట్ చేశాడో చూడండి..
Elon Musk: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు షాక్.. ఆకాశంలో పేలిపోయిన రాకెట్..!
Brain Teaser Test: మీ బ్రెయిన్‌కు సరైన సవాల్.. ఈ ఫొటోలో తప్పు ఏంటో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Lottery: లాటరీలో రూ.80 కోట్లు.. అయినా స్వీపర్‌గానే పని చేస్తున్న వ్యక్తి.. ఎందుకని అడిగితే..
Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఈమె సముద్రంలో నీళ్లు ఎందుకు పడుతోందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..