Viral Video: దేశంలో తెలివైన వాళ్లకు కొదవ లేదు.. కార్ అద్దం పగిలిపోవడంతో ఎలా సెట్ చేశాడో చూడండి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:03 PM
రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చాలా మంది సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి పని పూర్తి చేస్తుంటారు. అలాంటి జుగాడ్ వీడియోలు సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి. అలాంటి వీడియోలను చాలా మంది ఇష్టపడుతున్నారు.

మనదేశంలో చాలా మంది అద్భుతమైన తెలివితేటలను (Intelligence) ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి పని పూర్తి చేస్తుంటారు. అలాంటి జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి. అలాంటి వీడియోలను చాలా మంది ఇష్టపడుతున్నారు. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).
theindiansarcasm అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా సైడ్ మిర్రర్ పగిలిపోయింది. దీంతో వెనుక వచ్చే వాహనాలు అతడికి కనిపించడం లేదు. అలా డ్రైవ్ చేయడం ప్రమాదాలకు కారణమవుతుంది. దీంతో ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను సైడ్ మిర్రర్‌పై పెట్టి ప్లాస్టర్ అంటించాడు. ఆ మొబైల్ ఫోన్ కెమేరా ఆన్ చేసి ఉండడంతో వెనుక అంతా స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని చూస్తూ ఆ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వ్యక్తి తన బ్రెయిన్‌ను అద్భుతంగా వినియోగించాడు``, ``రూ.1.5 లక్షలు విలువైన సైడ్ మిర్రర్``, ``ఆ ఫోన్‌ను ఎవరైనా పట్టుకుపోతే ఏం చేస్తారు``, ``కేవలం రీల్స్ కోసమే ఈ ట్రిక్ వేశారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Elon Musk: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు షాక్.. ఆకాశంలో పేలిపోయిన రాకెట్..!
Brain Teaser Test: మీ బ్రెయిన్‌కు సరైన సవాల్.. ఈ ఫొటోలో తప్పు ఏంటో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Lottery: లాటరీలో రూ.80 కోట్లు.. అయినా స్వీపర్‌గానే పని చేస్తున్న వ్యక్తి.. ఎందుకని అడిగితే..
Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఈమె సముద్రంలో నీళ్లు ఎందుకు పడుతోందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..