Pratyekam : అక్కడ ఉచితంగా తాగినంత మద్యం.. ఈ ప్రయోజనం అదనం..
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:52 PM
సంస్థను అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో ఒకటి తమ ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి మంచి ఫలితాలు రాబట్టడం. సాధారణంగా డబ్బు, పవర్ న్యాప్ పీరియడ్ ఇలా ఎన్నోరకాల సదుపాయాలు కల్పించడం వినే ఉంటారు. ఓ కంపెనీ మరో అడుగు ముందుకేసి ఏకంగా తమ ఉద్యోగులకు తాగినంత మద్యం ఉచితంగా ఇస్తోంది. పైగా అదనంగా ఈ ప్రయోజనాలూ కల్పిస్తోంది.

Company Offers Free Alcohol to Employees: సంస్థను అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో ఒకటి తమ ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి మంచి ఫలితాలు రాబట్టడం. అప్పుడే సంస్థ నిలకడగా ప్రగతి పథంలో దూసుకుపోతోందని యాజమాన్యాల నమ్మకం. గూగుల్, అమెజాన్ ఇలా ఎన్నో దిగ్గజ సంస్థలు డబ్బు, విలాసవంతమైన వసతి సౌకర్యాలు, పవర్ న్యాప్ ఇలా ఉదారమైన ప్రయోజనాలు కల్పించడం వినే ఉంటారు. కానీ, ఓ టెక్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. తమ ఉద్యోగులకు తాగినంత మద్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా ఈ సదుపాయాలూ అందిస్తోంది. మరి, ఈ విచిత్రమైన కంపెనీ ఎక్కుడుందో మీకూ తెలుసుకోవాలనుందా..
ఈ కంపెనీలో పనిచేస్తే మద్యం ఫ్రీ.. ఇంకా
ప్రతిభగల యువతను సంస్థలో చేర్చుకోవడమే ధ్యేయంగా జపాన్‌లోని ‘ట్రస్ట్ రింగ్’ సంస్థ కొత్త తరహా విధానాలను తీసుకొచ్చింది. జెన్ జీ అలవాట్లు, జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని వెరైటీ స్కెచ్ వేసింది. ఇది వరకూ ఏ కంపెనీ చేయని విధంగా 'హ్యాంగోవర్ లీవ్స్' అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఉద్యోగులకు తాగినంత మద్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు మరుసటి రోజున మత్తు వదలక బాధపడేవారికి హ్యంగోవర్ లీవు కూడా అందిస్తోంది.
భలే సదుపాయాలు..
జపాన్‌కు చెందిన ‘ట్రస్ట్ రింగ్’ కంపెనీ ప్రకటించిన కొత్త పథకాలు అక్కడి యూత్‌కు తెగ నచ్చేశాయి. ఉచిత మద్యం, హ్యాంగోవర్ లీవ్ సదుపాయం ఎక్కడా దొరకదని కంపెనీ ఉద్యోగులు సంబరపడిపోతున్నారు. ఇదే కాక అలసటగా అనిపిస్తే రెండు లేదా మూడు గంటలు నిద్రపోయి డ్యూటీ ఎక్కేలా అవకాశం కల్పించారని సంతోషంగా చెబుతున్నారు ఇక్కడి ఉద్యోగులు. చిన్న కంపెనీ కావడం.. ఎక్కువ జీతం చెల్లించేంత టర్నోవర్ లేకపోవడం వంటి కారణాలతో.. న్యూ టాలెంట్‌ను ఆకర్షించేందుకు ఇలాంటి సదుపాయాలు అందిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Meta Layoffs: మహిళా ఉద్యోగికి షాక్.. ప్రసూతి సెలవుల తరువాత ఆఫీసుకొచ్చాక ఊస్టింగ్!
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి టెస్ట్.. ఈ ద్వీపంలోకి వెళ్లే డోర్ ఎక్కడుందో కనిపెట్టండి..
Viral: భార్యపై ఎంత ప్రేమ ఉందో ఇలాంటి టైంలోనే తెలిసేది! కుంభమేళాలో క్యూట్ సీన్!
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..