Viral Video: డబ్బా లాంటి గదికి ఇంత అద్దె కట్టాలా.. షాకవుతున్న నెటిజన్లు..
ABN , Publish Date - May 03 , 2025 | 11:39 AM
Dubai Tiny Room Viral Video: బాల్కానీ అంత కూడా లేని ఈ గదికి ఇంత అద్దెనా అని.. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. దుబాయ్ లో ఇంటి అద్దె ఈ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Dubai Tiny Room Viral Video: దుబాయ్ అంటే ఆకాశాన్ని తాకే బిల్డింగులు, షాపింగ్ మాల్స్, లగ్జరీకి మారుపేరు. అంతేగాక, దుబాయ్ కు వెళ్తే బాగా సంపాదించవచ్చని చాలామంది అభిప్రాయం. అందుకని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరంగా పేరొందిన దుబాయ్ లో ఇళ్లు దొరకడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికినా చిన్న గదికి కట్టాల్సిన అద్దె ఎంతో తెలిస్తే కచ్చితంగా కళ్లు తేలేస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ వీడియోనే సాక్ష్యం. బాల్కానీలో ఉన్నంత స్థలం కూడా లేని ఈ గదికి ఇంత అద్దె కట్టాలా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
నెసన్ సర్వీసెస్ అనే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ దుబాయిలోని మరీనాలో ఉన్న ఓ అద్దె రూంకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఒక సింగిల్ బెడ్, కప్ బోర్డ్, సైడ్ టేబుల్ మాత్రం ఇందులో సరిపోతాయి. ఈ గదికి ప్రతి నెలా 2700 దిర్హమ్స్ అంటే రూ.62,000 అద్దె కట్టాలని పేర్కొంటూ, 'పార్టిషన్ విత్ బాల్కనీ' అని కూల్ గా ట్యాగ్ చేసింది. ఇది చూసిన నెటినజ్లకు మతిపోతోంది. 'అరె, ఇది నిజంగా గదా? బాత్‌రూం కంటే చిన్నగా ఉందేంటి?' అంటూ సోషల్ మీడియా యూజర్ల కామెంట్లతో హొరెత్తిస్తున్నారు.
ఈ వైరల్ పోస్ట్ ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా చూశారు. ఈ చిన్న గది వీడియో చూసి రకరకాల ఫన్నీ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒకరు 'ఇది నా బాత్రూం కంటే పెద్ది బ్రో' అంటే, మరొకరు 'బాల్కానీ లా పెద్దగా ఉందే' అని, 'బాల్కానీ ఏంది సామీ.. ఇంకొక్క అడుగు ముందుకేస్తే రోడ్డుపై పడతాం', 'దుబాయిలో గాలి కూడా అద్దెకు తీసుకోవాలేమో' అని సెటైర్లు వేస్తున్నారు. ఈ వైరల్ పోస్ట్ తో దుబాయ్ లో రూం రెంట్లు ఎంత ఖరీదైనవో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఇదిలా ఉంటే.. అక్కడి ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ‘రియల్ టైం రెంటల్ ఇండెక్స్’ ప్రారంభించింది. మార్కెట్‌లోని డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో అద్దెలు చాలా ప్రాంతాల్లో8 నుంచి 15 శాతం వరకూ మార్కెట్ల్ విశ్లేషకుల సమాచారం.
Read Also: Crocodile Attacks Tourist: కొలనులో ఉన్న మొసలి వద్దకు వెళ్లి మరీ సెల్ఫీకి ప్రయత్నం.. షాకింగ్ వీడియోManju Warrier: హీరోయిన్‌కు చేదు అనుభవం.. నడుం పట్టుకున్న అభిమాని..
Cobra vs Dogs: కింగ్ కోబ్రాతో కుక్కల డేంజరస్ గేమ్.. చివరికి జరిగింది చూస్తే..