Share News

Crocodile Attacks Tourist: కొలనులో ఉన్న మొసలి వద్దకు వెళ్లి మరీ సెల్ఫీకి ప్రయత్నం.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - May 03 , 2025 | 10:54 AM

సెల్ఫీ కోసం కొలనులో దిగిన ఓ టూరిస్టుపై మొసలి దాడి చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

Crocodile Attacks Tourist: కొలనులో ఉన్న మొసలి వద్దకు వెళ్లి మరీ సెల్ఫీకి ప్రయత్నం.. షాకింగ్ వీడియో
Crocodile Attacks Tourist

ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కదలకుండా ఉన్న మొసలిని గుర్తించలేక సెల్ఫీకి ప్రయత్నించిన ఓ టూరిస్టుపై అది దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కబుబ్ మాంగ్రూవ్ పార్క్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, యువకుడు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఆ నేషనల్ పార్కుకు వచ్చాడు. అక్కడి ఓ కొలనులో అతడికి మొసలి లాంటి ఆకారం నీళ్లల్లో అచేతనంగా కనిపించింది. అయితే, అది పర్యాటకులను ఆకర్షించేందుకు నీళ్లల్లో ఏర్పాటు చేసిన విగ్రహం అని అతడు భావించాడు. కొలనులోకి దిగి సెల్ఫీకి ట్రై చేశాడు. అతడు ఫొటో దిగుతుండగా మొసలి ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసింది.

నోటితో అతడిని పట్టి నీళ్లల్లోకి లాగేందుకు ప్రయత్నించింది. దాదాపు 15 అడుగుల పొడవున్న మొసలి దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టూ ఉన్న వారు ఈ దారుణ దృశ్యాన్ని చూసి షాకైపోయారు. చేష్టలుడిగి చూస్తుండిపోయారు. పర్యాటకుల హాహాకారాలతో అప్రమత్తమైన పార్కు సిబ్బంది దాదాపు అరగంట సేపు మొసలితో పోరాడిని యువకుడిని రక్షించ గలిగారు. బాధిత యువకుడికి తీవ్ర గాయాలైనప్పటికీ ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానిక పోలీసులే స్వయంగా నెట్టింట పంచుకున్నారు. ఈ మూర్ఖుడు.. అత్యంత చెత్త పని చేసి మొసలికి చిక్కాడంటూ ఘాటు క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ జనాలు విస్మయం వ్యక్తం చేశారు. మొసలిని విగ్రహం అనుకోవడం ఏంటి.. ముందూ వెనుకా ఆలోచించకుండా నీళ్లల్లోకి దిగడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు సందర్శించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బోనుల్లో ఉన్న క్రూరమృగాలను సమీపించరాదని హెచ్చరించారు.


జలచరాల్లో మొసళ్లు అత్యంత క్రూరమైనవన్న విషయం తెలిసిందే. నీటి సమీపానికి వచ్చిన ఏ జంతువునైనా నీటిలోకి లాగి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి. క్షణాల వ్యవధిలో శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాయి.

ఇవి కూడా చదవండి:

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - May 03 , 2025 | 10:57 AM