Share News

Manju Warrier: హీరోయిన్‌కు చేదు అనుభవం.. నడుం పట్టుకున్న అభిమాని..

ABN , Publish Date - May 02 , 2025 | 09:51 PM

Heroine Manju Warrier: కార్యక్రమం ముగిసిన తర్వాత ముంజు వారియర్ కారు దగ్గరకు వచ్చింది. కారు ఎక్కి వెళ్లబోతుండగా జనం ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె కారులోంచి బయటకు వచ్చింది. జనానికి అభివాదం చేసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని భావించారు.

Manju Warrier: హీరోయిన్‌కు చేదు అనుభవం.. నడుం పట్టుకున్న అభిమాని..
Heroine Manju Warrier

సినిమా వాళ్లంటే పబ్లిక్ ప్రాపర్టీలాగా ఫీలవుతున్నారు కొంతమంది జనం. ఎవరైనా సినిమా సెలెబ్రిటీ కనపడితే చాలు ఫొటోలకు ఎగబడతారు. వారు ఇబ్బందిగా ఫీలై అసహనం వ్యక్తం చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. పొగరెక్కువైందంటూ కామెంట్లు చేస్తారు. ఇక, హీరోయిన్లు పబ్లిక్‌లోకి వస్తే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. సందు దొరికితే తప్పుగా ప్రవర్తించే వారే ఎక్కువ. తాజాగా, ప్రముఖ మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమె నడుం పట్టుకున్నాడు. మంజు వారియర్ తాజాగా, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలిసి జనం పెద్ద సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు.


కార్యక్రమం ముగిసిన తర్వాత ముంజు వారియర్ కారు దగ్గరకు వచ్చింది. కారు ఎక్కి వెళ్లబోతుండగా జనం ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె కారులోంచి బయటకు వచ్చింది. జనానికి అభివాదం చేసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని భావించారు. చేతులు ముందుకు చాచుతూ ఉన్నారు. ఆమె వారి వైపు చూడలేదు. దీంతో ఓ వ్యక్తి చేత్తో ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మంజు వారియర్ పట్టించుకోలేదు. కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మంజు సెకండ్ ఇన్నింగ్స్..

1995లో వచ్చిన సాక్ష్యం అనే మలయాళ సినిమాతో మంజు వారియర్ హీరోయిన్‌గా మారింది. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయింది. స్టార్‌గా ఉన్న టైంలోనే స్టార్ హీరో దిలీప్‌తో ప్రేమలో పడింది.1998 ఇద్దరికీ పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయింది. అయితే, దిలీప్ మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2014 నుంచి మంజు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 2024లో వచ్చిన రజినీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇవి కూడా చదవండి

DGP Om Prakash Case: డీజీపీ హత్య.. భార్య కళ్లముందే గిలగిలా కొట్టుకున్న డీజీపీ

Allu Arjun: అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని తెలుసా..

Updated Date - May 02 , 2025 | 09:51 PM