Share News

DGP Om Prakash Case: డీజీపీ హత్య.. భార్య కళ్లముందే గిలగిలా కొట్టుకున్న డీజీపీ

ABN , Publish Date - May 02 , 2025 | 09:07 PM

DGP Om Prakash Case: డీజీపీ చనిపోయిన తర్వాత పల్లవి ఇళ్లంతా కలయ తిరిగింది. నేలపై పారిన డీజీపీ రక్తాన్ని తొక్కుకుంటూ ఇళ్లంతా తిరిగింది. డీజీపీ చనిపోయినా కూడా .. బతికే ఉన్నాడని ఆమె అనుకుంది. కొద్దిసేపటి తర్వాత గన్ పౌడర్ తెచ్చి శవంపై చల్లింది.

DGP Om Prakash Case: డీజీపీ హత్య.. భార్య కళ్లముందే గిలగిలా కొట్టుకున్న డీజీపీ
DGP Om Prakash Case

రిటైర్డ్ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భార్య పల్లవి ఆయన్ని దారుణంగా హత్య చేసింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీసింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణలో పల్లవి పలు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘ దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన వేధింపులు భరించాను. చివరకు తట్టుకోలేక చంపడానికి నిశ్చయించుకున్నాను. రివేంజ్ ప్లాన్ చేశాను.


తినడానికి కూర్చున్నపుడు వెనుకనుంచి బాటిల్‌తో ఆయనను పొడిచాను. తర్వాత కత్తితో చాలా సార్లు పొడిచాను. అతడు నొప్పి తట్టుకోలేక కిందపడి పోయి గిలగిలలాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను హార్పిక్ తెచ్చి గాయాలపై చల్లాను. అతడు మరింత అల్లాడిపోయాడు. దాదాపు 25 నిమిషాల పాటు నా కళ్ల ముందే గిలగిలా కొట్టుకున్నాడు. అతడు బతికుండగానే ఓ బెడ్ షీటు తెచ్చి అతడిపై కప్పాను’ అని చెప్పినట్లు సమాచారం. డీజీపీ చనిపోయిన తర్వాత పల్లవి ఇళ్లంతా కలయ తిరిగింది.


నేలపై పారిన డీజీపీ రక్తాన్ని తొక్కుకుంటూ ఇళ్లంతా తిరిగింది. డీజీపీ చనిపోయినా కూడా .. బతికే ఉన్నాడని ఆమె అనుకుంది. కొద్దిసేపటి తర్వాత గన్ పౌడర్ తెచ్చి శవంపై చల్లింది. విచారణ చేస్తున్న సమయంలోనే పోలీసులు పల్లవి వేలిముద్రలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అంతేకాదు.. ఓ రిటైర్డ్ ఐఏఎస్ భార్యను.. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను కూడా పోలీసులు విచారించారు. కేసుకు సంబంధించి పలు విషయాలు సేకరించారు. ఈ హత్యలో డీజీపీ కూతురి హస్తం ఉందా.. లేదా.. అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని తెలుసా..

11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..

Updated Date - May 02 , 2025 | 09:10 PM