Share News

11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..

ABN , Publish Date - May 02 , 2025 | 07:11 PM

Teacher: ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్‌తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.

11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..
Teacher

ఓ ట్యూషన్ టీచర్ తన దగ్గర చదువుకోవడానికి వచ్చే పిల్లాడితో ప్రేమలో పడింది. అతడు లేకుండా ఉండలేననుకుంది. అతడు కూడా టీచర్‌ను ప్రేమించాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇళ్లు విడిచిపారిపోయారు. చివరికి కథ అడ్డం తిరిగి.. టీచర్ జైలు పాలైంది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, సూరత్‌లోని శామ్లాజీకి చెందిన 23 ఏళ్ల యువతి స్థానికంగా ఉండే పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటుంది. 11 ఏళ్ల బాలుడు కూడా ఆమె దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉన్నాడు.


ఈ నేపథ్యంలోనే టీచర్‌కు, బాలుడికి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఇళ్లు విడిచిపోయి దూరంగా బతకాలనుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఇళ్లు విడిచి పారిపోయారు. పిల్లాడు ఎంతకీ ఇంటికి రాకపోయే సరికి అతడి తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్‌తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.


బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీస్ టీంలు వారి కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. టీచర్, బాలుడు మొదట అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత వడోదరా నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడినుంచి నేరుగా జైపూర్ వెళ్లారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో రెండు రోజులు ఉన్నారు. వీరి గురించి సమాచారం అందుకున్న పోలీసులు గుజరాత్.. రాజస్థాన్ బార్డర్‌లో అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు టీచర్‌ను విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లాడి కారణంగా తను గర్భం దాల్చానంటూ ఆమె బాంబు పేల్చింది. దీంతో టీచర్‌తో పాటు పిల్లాడిని కూడా వైద్య పరీక్షల కోసం పంపారు. పోలీసుల విచారణలో మరో విషయం కూడా బయటపడింది. బాలుడి వయసు 11 సంవత్సరాలు కాదని.. 13 సంవత్సరాలని తేలింది. పోలీసులు.. టీచర్‌ను గురువారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీ విధించింది.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..

Updated Date - May 02 , 2025 | 08:15 PM