Rajanna Sircilla District: ఆత్మహత్య చేసుకున్న తల్లి.. విషయం తెలిసిన కొడుకు.. చివరకు..
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:24 PM
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. నరకం చూపించే కొడుకులు ఉన్న రోజులివి. అయితే అంతా ఇలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లి ఇక లేదని తెలిసి ఓ కొడుకు చేసిన పనికి.. అంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు..
తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. పిల్లల సంక్షేమం కోసం అవసరమైతే తన జీవితాన్ని సైతం త్యాగం చేస్తుంది. పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. అలాంటి తల్లి పట్ల కొందరు కొడుకులు రాక్షసంగా ప్రవర్తించడం చూస్తుంటాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. అయితే అంతా ఇలాగే ఉంటారా.. అంటే ఉండరు అని చెప్పాల్సి వస్తుంది. తాజాగా, తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి కొడుకు చేసిన పని చూసి అంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ (Telangana) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లలిత అనే మహిళకు అభిలాష్ అనే కొడుకు ఉన్నాడు. ఇతను సిరిసిల్ల సర్దాపూర్ 17 బెటాలియన్ లో టీజీఎస్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తు్న్నాడు. ఏమైందో ఏమో తెలీదు గానీ.. గురువారం లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గురువారం మొత్తం గాలించారు. అలాగే గ్రామస్తులు కూడా పరిసరాలు మొత్తం వెతికారు. ఈ క్రమంలో చివరకు శుక్రవారం లలిత మృతదేహాన్ని బయటికి తీశారు.
తల్లి మృతదేహాన్ని చూసి.. కొడుకు అభిలాష్ తట్టుకోలేకపోయాడు. తల్లి దూకిన వాగులోనే తానూ దూకాడు. అయితే ఆ సమయంలో అక్కడున్న వారికి ఈత రాకపోవడంతో అతన్ని కాపాడలేకపోయారు. చివరకు కొడుకు కూడా అదే వాగులో ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి బాగోగులు చూసుకునే కొడుకులు కనుమరుగవుతున్న నేటి రోజుల్లో.. తల్లి లేదన్న విషయం తెలిసి, తానూ ఆత్మహత్య చేసుకున్న కొడుకును చూసి అంతా అయ్యో పాపం అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లి, కొడుకు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
Read Latest Telangana News And Telugu News