Doomsday Fish Video Viral: ఓరి నాయనో.. డూమ్స్‌డేని పట్టుకొచ్చారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:35 PM
చేపలలో అనేక రకాలు ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా డూమ్స్‌డే చేప చూశారా? ఈ చేప కిలోల బరువు, దీని పొడవు చూస్తే ఆశ్చర్యపోతారు..
చెన్నై: 'డూమ్స్‌డే ఫిష్' అనేది నిజానికి ఓర్ ఫిష్ అనే లోతైన సముద్ర చేప. ఇది ప్రకృతి వైపరీత్యాలకు (భూకంపాలు, సునామీలు) సంకేతమని అంటుంటారు. ఇది చాలా అరుదుగా ఉపరితలం దగ్గర కనిపిస్తుంది. అయితే, అటువంటి చేప ఇటీవల తమిళనాడులోని పాంబన్ సమీపంలో మత్స్యకారుల వలలో చిక్కింది. పాంబన్–మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో చేపలు వేటకు వెళ్లిన జాలర్ల వలలో ‘డూమ్స్‌డే’ అనే అరుదైన చేప దొరికింది. ఈ చేప సుమారు 10 కిలోల బరువు, 5 అడుగుల పొడవు ఉంది.
మత్స్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ జాతి చేపలు పొడవుగా, కండగలిగి ఉంటాయి. చారల రంగు శరీరం, నారింజ రంగు రెక్కలు వీటి ప్రత్యేక లక్షణాలు. ఉప ఉష్ణమండల సముద్రాల్లో ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో, ఈ చేప ఒడ్డుకు దగ్గరగా వస్తే ఆ దేశానికి విపత్తు కలగవచ్చని మత్స్యకారులు నమ్ముతారు. అందుకే, దీనికి ‘డూమ్స్‌డే’ అనే పేరు వచ్చింది. అయితే, దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ‘డూమ్స్‌డే’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ చేప ఏంట్రా నాయనా ఇలా ఉందని కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు మాత్రం ఓరి నాయనో ఈ చేప ఏంటి ఇంత పొడువుంది అంటూ షాకవుతున్నారు. సమాచారం, ప్రకారం.. ఈ డూమ్స్‌డే సముద్రంలో కొట్టుకురాలేదట.. దీనిని మన మత్స్యకారులే పట్టుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:
భాగ్యనగరంలో బయటపడ్డ మరో భారీ స్కాం.. సంచలన విషయాలు వెలుగులోకి..
సమాజంలో మార్పు.. మహిళల ద్వారానే సాధ్యం: పవన్
For More Latest News