రామేశ్వరం సమీపంలోని పాంబన్ మన్నార్ గల్ఫ్ ప్రాంతం నుంచి ఇటీవల చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో ‘డూమ్స్‌డే’ అనే రకం చేపలు చిక్కాయి. ఇవి 10 కిలోల బరువు, 5 అడుగుల పొడవు ఉన్నాయి. మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘ఈ జాతి చేపలు పొడవుగా, కండగలిగి ఉంటాయి. చారల శరీరం, నారింజ రంగు రెక్కలు వీటి ప్రత్యేకత. ఉప ఉష్ణమండల సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి.