Share News

Watch video: రాజస్థాన్‌‌లో మాక్ డ్రిల్.. చీకట్లో బంగారు కోట.. వీడియో వైరల్..

ABN , Publish Date - May 08 , 2025 | 09:34 AM

ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట చీకటిమయమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Watch video: రాజస్థాన్‌‌లో మాక్ డ్రిల్.. చీకట్లో బంగారు కోట.. వీడియో వైరల్..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ .. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సుమారు 25 నిముషాల పాటు సాగిన ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు హతమవగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. అయితే ఈ ఆపరేషన్ అనంతరం పౌర రక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట చీకటిమయమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


భారతదేశం, పాకిస్తాన్ (India VS Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్‌లో (Rajasthan) కూడా అధికారులు మాక్ డ్రిల్ (Mock drill) నిర్వహించారు.

Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..


అయితే ఈ సందర్భంగా జైసల్మేర్ కోటలోని (Jaisalmer Fort) లైట్లు ఆర్పేయడంతో చీకటిలో కలిసిపోయింది. సాధారణంగా రాత్రి సమయంలో బంగారు వర్ణంతో మెరిసిపోతూ కనిపించే ఈ కోట.. ఇలా చీకట్లో కనిపించడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రాజస్థాన్‌కు పాకిస్తాన్‌తో సుమారు 1000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది. దీంతో బుధవారం సాయంత్రం నుంచే రాజస్థాన్‌ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సిగ్నల్స్ ఇచ్చే వరకూ అన్ని వాహనాలు కదలకుండా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

Funny Viral Video: మేడమైన అమ్మాయిని చూడగానే ఐఫోన్ ఇచ్చేశాడు.. తర్వాత పైకి చూసి ఖంగుతిన్నాడు..


జైసల్మేర్, బికనీర్, జోధ్‌పూర్, గంగానగర్‌తో సహా అన్ని సరిహద్దు జిల్లాలలో అర్ధరాత్రి నుండి ఉదయం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఇన్వర్టర్లు, జనరేటర్‌ల సాయంతో వెలిగే లైట్లను కూడా ఆర్పేయాలని కోరారు. మరోవైపు బ్లిక్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటూ అన్ని ఆసుపత్రుల్లో తగినన్ని మందులను నిల్వ చేసుకున్నారు. అదేవిధంగా సరిహద్దు జిల్లాల్లోని అన్ని పాఠశాలలను మూసేశారు. కాగా, రాజస్థాన్‌ కోటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Robot Funny Video: సినిమా చూపించిన రోబో.. యజమానిని ఎలా భయపెట్టిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 09:34 AM