Deepavali: రైళ్లలో బాణసంచా తీసుకెళ్లవచ్చా..
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:07 PM
దీపావళి పండగ సమీపిస్తోంది. రైళ్లలో మందుగుండు సామాగ్రిని తీసుకు వెళ్లవచ్చా? అంటే.. రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
దీపావళి సమీపిస్తుంది. స్కూళ్లు, విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించారు. దీంతో తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలతో ఈ పండగ చేసుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి పిల్లలంతా రైళ్లలో ఊళ్లకు వెళ్తుంటారు. ఆ క్రమంలో పళ్లు, స్వీట్లు, కొత్త దుస్తులు తీసుకెళ్తారు. అయితే వీటితో పాటు పండగ వేళ కాల్చుకోవడానికి మందుగుండు సామాగ్రిని సైతం రైళ్లలో తీసుకు వెళ్తుంటారు. అయితే వీటిని తీసుకెళ్ల కూడదని రైల్వే నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్లడంపై నిషేధం ఉందని నిబంధనలు చెబుతున్నాయి. ఒక వేళ అలా తీసుకెళ్లినట్లు అయితే.. ఆ ప్రయాణికులపై కేసులు నమోదు అవుతాయని నిబంధనలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రైలులో మండే స్వభావం ఉన్న మందుగుండు సామాగ్రితోపాటు పేలుడు పదార్థాలను నిషేధించినట్లు నిబంధనలు చెబుతున్నాయి.
నిబంధనలు ఎందుకంటే..
రైళ్లలో బాణసంచా తీసుకెళ్లడం నిబంధనల ఉల్లంఘించడం మాత్రమే కాదు.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు సైతం ముప్పు కలిగిస్తుంది.
చిన్నపాటి నిప్పు రవ్వ పొరపాటున పడినా.. రైలు మొత్తం దగ్ధం కావచ్చు. దీంతో భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
మరి ముఖ్యంగా ప్రతి ఏడాది దీపావళి వేళ.. రైల్వే భద్రతా విభాగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా రైళ్లలో తమ తనిఖీలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో మందుగుండు సామాగ్రితో ప్రయాణం చేయవద్దంటూ ప్రయాణికులను హెచ్చరిస్తోంది.
నిబంధనలు అతిక్రమిస్తే..
ఒక వేళ.. రైలులో ప్రయాణికులు ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించి వీటిని తీసుకు వెళ్లితే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద ప్రయాణికుడికి రూ.1000 జరిమానా, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకుంటే ఈ రెండు కూడా విధించవచ్చని రైల్వే నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
ట్విస్ట్ ఇచ్చిన వైద్య సిబ్బంది.. ఏఐజీ వద్ద ఉద్రిక్తత
రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
For More Pratyekam News And Telugu News