Share News

Watch Video: బిల్లు చూసి పిల్లాడు పరేషాన్.. వీడియో అస్సలు మిస్ అవ్వకండి..

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:13 PM

కొన్ని దేశాల్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నివసించాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూమ్ రెంట్స్, ఫుడ్ కాస్ట్ అన్నీ ఎక్కువే. బయట ఏదైనా తినాలంటే చాలు వందలాది డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.

Watch Video: బిల్లు చూసి పిల్లాడు పరేషాన్.. వీడియో అస్సలు మిస్ అవ్వకండి..
NRI kid viral video

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని దేశాల్లో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నివసించాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూమ్ రెంట్స్, ఫుడ్ కాస్ట్ అన్నీ ఎక్కువే. బయట ఏదైనా తినాలంటే చాలు వందలాది డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, భారత్‌లో మాత్రం విదేశాలతో పోల్చుకుంటే కాస్త బెటరే అని చెప్పాలి. విదేశాలలో రేట్లు.. మనదేశంలో రేట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చెన్నైలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఎన్నారై పిల్లాడు.. అక్కడ ఇచ్చిన బిల్లును చూసి అవాక్కయ్యాడు. అతని రెస్పాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పిల్లాడు తన తల్లిదండ్రులతో కలిసి ఇటీవల గీతం రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ తమకు నచ్చిన ఆహారం తిన్నారు. ఆ తరువాత బిల్లు పే చేశారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక.. బిల్లు స్లిప్‌ను పిల్లాడు చూశాడు. ఆ బిల్లు అమౌంట్ చూసి అవాక్కయ్యాడు.


రెస్టారెంట్‌లో వీరు.. బేబీ కార్న్ మంచూరియన్, బోండా, దహీ పాపడ్, స్పెషల్ ఫలూడా, ఇడ్లీ, పన్నీర్ మసాలా దోష, వెజ్ నూడుల్స్ తిన్నారు. వీటికి బిల్లు రూ. 1502 అయ్యింది. ఈ బిల్లును చూసి పిల్లాడు షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తను ఉంటున్న న్యూజిలాండ్‌లో కేవలం 3 వస్తువులకు మాత్రమే 200 డాలర్లు ఉంటుందని.. అలాంటిది 7 ఐటమ్స్‌కి కేవలం రూ.1502 ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. న్యూజిలాండ్‌లో కంటే భారత్‌లో ధరలు చాలా తక్కువగా ఉన్నాయని పిల్లాడు ఆనందం వ్యక్తం చేశాడు.


పిల్లాడి ఎక్స్‌ప్రెషన్స్‌కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియోను చూసి నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘భారతీయుల జీతాల స్లిప్‌లను కూడా ఆ పిల్లాడికి చూపించాలి. అప్పుడు అతను చూపే ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి.’ అని కోరుకుంటున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘రూ. 1500 లకు 7 వస్తువులు అంటే ఇప్పటికీ మాకు అది ఖరీదైనదే’ మరికొందరు కామెంట్ పెట్టారు.


Also Read:

హెల్త్ అలర్ట్.. ప్రజలను ఎక్కువగా భయపెడుతోన్న వ్యాధులు ఇవే..

యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

బైడెన్ చెత్త అధ్యక్షుడు.. ఒబామా విభజనకారి.. మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్..

Updated Date - Dec 18 , 2025 | 04:13 PM