Walk of Fame controversy: బైడెన్ చెత్త అధ్యక్షుడు.. ఒబామా విభజనకారి.. మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్..
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:54 PM
అగ్రరాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుల ఫొటోలు వైట్‌హౌస్‌లో తప్పనిసరిగా ఉంటాయి. వారు డెమొక్రాట్లైనా లేదా రిపబ్లికన్‌లైనా వారి ఫొటోలకు శ్వేతసౌధంలో స్థానం పదిలం. ఇటీవల వైట్‌హౌస్‌లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' అనే ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.
అగ్రరాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుల ఫొటోలు వైట్‌హౌస్‌లో తప్పనిసరిగా ఉంటాయి. వారు డెమొక్రాట్లైనా లేదా రిపబ్లికన్‌లైనా వారి ఫొటోలకు శ్వేతసౌధంలో స్థానం పదిలం. ఇటీవల వైట్‌హౌస్‌లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' అనే ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిని కలిసేందుకు వచ్చే అతిథులు, ప్రముఖులు ఈ గ్యాలరీని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఆ చిత్రపటాల కింద రాసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి (Sleepy Joe remark).
ఆ వ్యాఖ్యలను స్వయంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసినట్టు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ఆ ఫొటోలలోని కొందరు మాజీ అధ్యక్షులపై తీవ్రమైన విమర్శలు, మరికొందరిపై ప్రశంసలతో కూడిన వాక్యాలు ఉన్నాయి. జో బైడెన్, బరాక్ ఒబామా, జిమ్మీ కార్టర్ వంటి డెమోక్రటిక్ అధ్యక్షులను తీవ్రంగా విమర్శించారు. అలాగే రొనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ వంటి రిపబ్లిక్ నేతలను మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Divisive Obama comment).
ఈ గ్యాలరీలో జో బైడెన్ ఫొటో కూడా పెట్టకుండా ఫ్రేమ్ మాత్రం పెట్టి అవమానించారు (political headlines USA). అలాగే 'అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు' అంటూ బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో అవినీతికి పాల్పడి ఆయన అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అలాగే బైడెన్‌ను 'స్లీపీ', 'క్రూకెడ్' అంటూ అభివర్ణించారు. ఇక, ఒబామాను కూడా అదే స్థాయిలో విమర్శించారు. 'అమెరికా చరిత్రలో అత్యంత విభజనకర రాజకీయాలు చేసిన వ్యక్తి' అని పేర్కొన్నారు. అఫర్డబుల్ కేర్ చట్టం, ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందం వంటి నిర్ణయాలపై విమర్శలు చేశారు. కాగా, ట్రంఫ్ ఫొటో కింద మాత్రం అమెరికాను కాపాడే వ్యక్తి అని రాసుకున్నారు.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో ఈ కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచే పొరపాటు చేయకండి.!
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. కీలక అంశాలపై ఫోకస్