Share News

Kumbhmela Monalisa: సోషల్ మీడియా పాప్యులారిటీతో చిక్కులు.. కుంభమేళాకు గుడ్‌బై చెప్పేసిన మోనాలిసా!

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:23 PM

సోషల్ మీడియా పాప్యులారిటీ కారణంగా వేధింపుల పాలైన కుంభమేళా మోనాలిసా చివరకు ప్రయాగ్‌రాజ్‌ను వీడింది. తన భద్రత కోసం సోంతూరికి వెళ్లిపోతున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొంది.

Kumbhmela Monalisa: సోషల్ మీడియా పాప్యులారిటీతో చిక్కులు.. కుంభమేళాకు గుడ్‌బై చెప్పేసిన మోనాలిసా!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఇచ్చిన పాప్యులారిటీతో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన ఇండోర్ యువతి మోనీ భోన్సలే యావత్ దేశానికి కుంభమేళా మోనాలిసాగా పరిచయమైపోయింది. కానీ ఇదే పాప్యులారిటీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి చివరకు ప్రయాగ్‌రాజ్‌ను వీడేలా చేసింది. తన భద్రత పట్ల ఆందోళనతో తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది (Viral)..

‘‘నా భద్రత, నా కుటుంబ భద్రత కోసం నేను ప్రయాగ్‌రాజ్‌ను వీడుతున్నాను. వీలుంటే వచ్చే ఏడాది కుంభమేళాకు వస్తాను’’ అని ఒక్క వాక్యంలో తన నిర్ణయాన్ని జనాలతో పంచుకుంది. అందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రయాగ్‌రాజ్‌కు వీడ్కోలు పలికింది.

Student Threatens Prinicipal: స్మార్ట్ ఫోన్‌ వ్యసనంతో పెడతోవ పట్టి.. ఏకంగా ప్రిన్సిపాల్‌కే దమ్కీ!


ఓ కంటెంట్ క్రియేటర్ పంచుకున్న వీడియో కారణంగా మోనీ భోన్సలే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాప్యులారిటీ వచ్చింది. ముదురు గోధుమ రంగులో ఉన్న కళ్లతో భారతీయ సహజ సౌందర్యానికి ప్రతీకగా ఉన్న ఆమెను చూసీ చూడగానే జనాలు ఫిదా అయిపోయారు. ఆమె కళ్లల్లో అస్పష్టమైన అనేక భావాలను కనిపిస్తు్నాయంటూ యువతికి మోనాలిసాగా పేరు పెట్టారు.

ఇలా అకస్మాత్తుగా వచ్చిన పాప్యులారిటీతో మొదట ఆమె కూడా కాస్త సంబరపడ్డట్టే అనిపించింది. అనేక మంది ఆమెను సమీపించడంతో పాటు సెల్ఫీలు తీసుకోవడంతో సంతోషించింది. ఆమెకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కూడా సినిమా ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

Sweaters for Elephants: మానవత్వం అంటే ఇదీ.. ఏనుగులు చలికి తట్టుకోలేకపోతున్నాయని..


ఇంతలోనే పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది. ఆమెకు పోకిరీల వేధింపులు మొదలయ్యాయి. ఓ సారి ఏకంగా కొందరు ఆమె టెంట్‌లోకి ప్రవేశించి సెల్ఫీ కోసం వేధించారు. దీంతో, ఆమె కుటుంబసభ్యులు కూడా కంగారు పడిపోయారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లో ఆమె ఉండటం సరికాదని భావించిన తండ్రి ఆమెను సొంతూరికి పంపించేశారు. ఈ ఉదంతంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. పొట్టి కూటి కోసం పూల దండలు అమ్ముకుంటున్న యువతి పొట్టకొట్టారంటూ విమర్శలు గుప్పించారు.

అదృష్టం అంటే ఇదీ.. ప్రభుత్వోద్యోగికి బంపర్ లాటరీ!

Visa Woes: మొదలైన ట్రంప్ దబిడిదిబిడి! పిల్లల్ని చూసేందుకు అమెరికాకు వెళ్లితే ఎయిపోర్టులోనే..

Read Latest and Viral News

Updated Date - Jan 24 , 2025 | 11:23 PM