Share News

అదృష్టం అంటే ఇదీ.. ప్రభుత్వోద్యోగికి బంపర్ లాటరీ!

ABN , Publish Date - Jan 24 , 2025 | 10:41 PM

రాజస్థాన్ ప్రభుత్వోద్యోగికి ఊహించని విధంగా అదృష్టం వరించింది. ఇటీవల ఓ లాటరీలో ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి పిల్లల్ని సెటిల్ చేస్తానని చెప్పుకొచ్చారు.

అదృష్టం అంటే ఇదీ.. ప్రభుత్వోద్యోగికి బంపర్ లాటరీ!

ఇంటర్నెట్ డెస్క్: అసలే ప్రభుత్వ ఉద్యోగం.. ఆపై లాటరీ తగిలితే లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతకు మించి లక్ మరోటి ఉండదు కదూ! రాజస్థాన్‌ ప్రభుత్వ ఉద్యోగికి సరిగ్గా ఇలాంటి అసాధారణ అదృష్టం వరించింది. రాత్రి రాత్రి కోటీశ్వరుడైపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).

రాజస్థాన్‌కు చెందిన అనీల్ కుమార్ ప్రభుత్వ క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన నాలుగు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ లాటరీలో ఫస్ట్ ప్రైజు రూ. 10 కోట్లు. అయితే, అనీల్ కుమార్‌కు రెండో బహుమతి కింద ఏకంగా రూ.కోటి దక్కింది. దీంతో, అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది (Rajasthan Clerk Wins 1 Cr Lottery).


Student Threatens Prinicipal: స్మార్ట్ ఫోన్‌ వ్యసనంతో పెడతోవ పట్టి.. ఏకంగా ప్రిన్సిపాల్‌కే దమ్కీ!

తన అదృష్టానికి బాబా ఖాతూ శ్యామ్ దీవెనలే కారణమని అనీల్ కుమార్ తెలిపారు. ఆ ఆశీర్వచనాలే తనను లాటరీ వైపు మళ్లేలా చేశాయని అన్నారు. ఈ కోటితో తాను తన అప్పులు తీర్చి పిల్లల భవితకు బంకరు బాటలు పరుస్తానని పేర్కొన్నారు.

కాగా, తన షాపులో లాటరీలు కొన్న వ్యక్తులు భారీ బహుమతులు గెలుచుకోవడం తాను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని షాపు యజమాని తెలిపారు. తన వద్ద టిక్కెట్లు కొన్న వారికి లాటరీ దక్కే ఛాన్స్ ఎక్కువని స్పష్టం చేశారు. తన నిజాయతీ దేవుడి దీవెనలే ఈ ఒరవడికి కారణమన్నారు.

Sweaters for Elephants: మానవత్వం అంటే ఇదీ.. ఏనుగులు చలికి తట్టుకోలేకపోతున్నాయని..


ఇదెలా ఉంటే.. లాస్ ఏంజిలిస్‌లో ఓ వ్యక్తి లాటరీ గెలిచిస సొమ్ముతో కొన్న ఓ భారీ భవనం అక్కడి కార్చిచ్చులో పడి పూర్తిగా దగ్ధమైపోయింది. బాధితుడు గతేడాది లాటరీలో ఏకంగా రూ.16 వేల కోట్లు గెలుచుకున్నాడు. అందులో కొంత మొత్తంతో అత్యంత విలాసవంతమైన భారీ భవనాన్ని కొన్నాడు. కానీ మంటల చెలరేగడంతో తన కలల నివాసం బుగ్గిపాలైంది. దీంతో, అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు.

ఇక ప్రపంచంలోనే అత్యంత భారీ జాక్ పాట్‌‌ను ఓ వ్యక్తి 2022లో కొల్లగొట్టారు. సదరు వ్యక్తి ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ.16,830 కోట్లతో సమానం.

Read Latest and Viral News

Updated Date - Jan 24 , 2025 | 10:43 PM