Share News

Viral: పారాషూట్‌తో ఎగ్జామ్ సెంటర్‌లో దిగిన విద్యార్థి! ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:24 AM

ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు ఓ కాలేజీ విద్యార్థి పారాషూట్ సాయంతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఉదంతం తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: పారాషూట్‌తో ఎగ్జామ్ సెంటర్‌లో దిగిన విద్యార్థి! ఎందుకో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మహా నగరాలంటేనే ట్రాఫిక్ కష్టాలకు పర్యాయపదంలా మారాయి. అయితే, నగర వాసులు కూడా కొత్త కొత్త ఐడియాలతో ఈ సమస్య నుంచి తప్పించుకుంటున్నారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా మహారాష్ట్రలో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ అధికంగా ఉంటుందని భావించిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఏకంగా పారాషూట్‌ సాయంతో చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, సమర్థ్ అనే విద్యా్ర్థి వ్యక్తి గత పనికోసం పంచ్‌గని ప్రాంతానికి వెళ్లాడు. అదే రోజు అతడికి పరీక్ష కూడా ఉంది. అయితే, అతడు బయలుదేరదామనుకునే సరికి పరీక్షకు ఇంకా 15-20 నిమిషాల సమయమే మిగిలుంది. ట్రాఫిక్‌‌ రద్దీ కారణంగా సమయానికి చేరుకునే అవకాశమే లేదని అనిపించింది. దీంతో, అతడు పారాషూట్ సాయంతో పరీక్ష కేంద్రంలో దిగాడు.


ఢిల్లీలో తరచూ భూకంపాలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు!

పంచగనీలోని జీపీ అడ్వంచెర్స్ సంస్థ యజమాని, సాహస క్రీడల నిపుణుడు గోవింద్ యెవాలే సమర్థ్‌కు ఈ సాహసాన్ని ప్లాన్ చేయడంలో సహకరించాడు. తన టీంతో కలిసి అతడు అన్ని ఏర్పాట్లు చేశాడు. దీంతో, పారాషూట్ ద్వారా సమర్థ్ గాల్లో తేలుతూ పరీక్ష కేంద్రం వద్ద దిగాడు. పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లన్నీ చేసుకున్నాకే అతడి సాహసానికి పూనుకున్నాడు. చివరకు విజయం సాధించాడు. నిపుణులైన పారాగ్లైడర్స్ పర్యవేక్షణలో అతడు పని పూర్తి చేశాడు. కాగా, మహరాష్ట్రలోని సతారా ప్రాంతం పారాగ్లైండింగ్ క్రీడలకు ప్రసిద్ధి. ఇక్కడ సాహసక్రీడలకు అనుకూలమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. మరోవైపు, సమర్థ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట కూడా హల్‌చల్ చేస్తోంది.


Viral: తండ్రిపై చిన్నారి ఫిర్యాదు.. పోలీసులు వచ్చి చూస్తే..

కాగా, మలేషియాకు చెందిన ఓ మహిళ రోజూ ఉద్యోగానికి విమానంలో వెళుతున్న వైనం కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నఆఫీసుకు ఆమె నిత్యం కమర్షియల్ విమానాల్లో వెళ్లివస్తోంది. ఎయిర్ ఏషియాలో పనిచేస్తున్న ఆమె తనకు ఈ ప్రయాణం సౌకర్యమని, పిల్లల కోసం ప్రతిరోజూ ఇంటికి రాగలుగుతున్నానని పేర్కొంది.

Blinkit Ambulance: బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు అద్భుతం.. డాక్టర్ ప్రశంసలు

Viral: వామ్మో.. ఇతడు మామూలోడు కాదు.. పామును ఎలా పట్టాడో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Feb 17 , 2025 | 11:24 AM