ఢిల్లీలో తరచూ భూకంపాలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు!
ABN , Publish Date - Feb 17 , 2025 | 10:34 AM
ఢిల్లీలో తరచూ భూకంపాలు సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని నాలుగో సీస్మిక్ జోన్‌లో ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో తాజాగా సంభవించిన భూకంపంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలీక పరుగులు తీశారు. ఇటీవల కాలంలో ఇంత భారీ కుదుపు తామెన్నడూ చూడలేదని కొందరు. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత కలిగిన ఈ భూకంప కేంద్రం దుర్గాబాయ్ దేశముఖ్ కాలేజీ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సమీపంలో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మాలజీ ప్రకటించింది. ప్రజలు కంగారు పడొద్దని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. సెఫ్టీ ప్రొటోకాల్స్ అనుసరించాలని అన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు (National News).
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఢిల్లీలో భూకంపాలు రావడం అసాధారణమేమీ కాదట. భూకంపం ప్రమాదం రీత్యా నిపుణులు ఢిల్లీని జోన్ 4లో చేర్చారు. ఈ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కవేనని ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇక్కడ సగటున రిక్టర్ స్కేలుపై 5 నుంచి 5 తీవ్రత కలిగిన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు ఈ తీవ్ర 7, 8 పాయింట్లకు చేరొచ్చు. అయితే, ఈ వర్గీకరణ స్థిరం కాదని, అక్కడి భౌగోళిక స్వాభం మార్పులకు లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు. 1720 నుంచి ఇప్పటివరకూ ఢిల్లీలో 5.5 పాయింట్లు, ఆపై తీవ్రత కలిగిన భూకంపాలు ఐదు సార్లు సంభవించాయి.
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
భూఉపలితరం పలు చిన్న పెద్దా భూఫలకాలతో రూపొందింది. ఇవి నిత్యం ఒకదానితో ఒకటి ఢీకుంటూ ఉంటాయి. ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. ఇక ఉత్తరాదిన భారత ఉపఖండ భూఫలకం, యూరేషియన్ ఫలకంతో నిత్యం ఒరిపిడికి లోనుకావడంతో ఉత్తర భారతంలో భూకంపాల అవకాశం ఎక్కువ. దీనికి తోడు దేశ రాజధానిలో అనేక భవనాలను భూకంపాలను తట్టుకునేలా నిర్మించలేదు. దీనికి అధిక జన సాంద్రత లోను కావడంతో ఇక్కడ భూకంపం తాలూకు నష్టం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం ప్రకారం, భూకంప తీవ్రతను అనుసరించి భారత భూభాగాన్ని జోన్ 2 నుంచి జోన్ 5 వరకూ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు. జోన్ 5 భూకంప తీవ్రత అత్యధికంగా జోన్ 2లో అత్యల్పంగా ఉంటుంది. దేశ భూభాగంలో 30 శాతం మూడో జోన్‌లో, 11 శాతం ఐదో జోన్‌లో, 18 శాతం ఐదో జోన్‌లో, మిగతా భూభాగం రెండో జోన్‌లో ఉంది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి