Viral: తండ్రిపై చిన్నారి ఫిర్యాదు.. పోలీసులు వచ్చి చూస్తే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:36 AM
తండ్రి తన డబ్బు లాక్కున్నాడంటూ చైనాలో ఓ చిన్నారి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అసలేం జరిగిందో తెలిసి పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి తన పాకెట్ మనీ తీసేసుకున్నాడంటూ ఓ చిన్నారి ఫిర్యాదు చేయడంద చైనాలో సంచలనంగా మారింది. చిన్నారి ఫిర్యాదు విని గాబరాగా అతడి ఇంటికెళ్లిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నెట్టింట కూడా ఈ ఉదంతంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గాంన్సూ ప్రావిన్స్‌లోని లాంగ్జూ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఓ చిన్నారి ఇటీవల పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ‘‘ఓ చెడ్డ వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు. నా డబ్బు దోచుకున్నాడు’’ అని ఫోన్‌లో చెప్పారు. ఇది విని మొదట అధికారి షాకయ్యారు. అల్లరి పిల్లాడా.. పోలీసులకు ఫోన్ చేశావా? అన్న మాటలు కూడా ఫోనులో వినిపించాయి (Viral).
Blinkit Ambulance: బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు అద్భుతం.. డాక్టర్ ప్రశంసలు
ఆ తరువాత తనిఖీ కోసం అక్కడికి వెళ్లాక పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ‘‘అంకుల్ మీరు భలే త్వరగా వచ్చేశారే.. ఇదిగో ఈయనే నా డబ్బు తీసుకుంది.. ఈ చెడ్డ వ్యక్తిని అరెస్టు చేయండి’’ అంటూ అమాయక ధోరణిలో చెప్పుకుపోయాడు. విషయం అర్థం కావడంతో పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.
చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులు చిన్న పిల్లలకు ఏదైనా కొనుక్కోమని పాకెట్ మనీ ఇస్తుంటారు. ఓ ఎరుపు ఎన్వలప్‌లో పెట్టి ఈ డబ్బు బహుమతిగా ఇస్తారు. ఇలా చేస్తే ఆ ఏడాది అదృష్టం వెంటే ఉంటుందని వారి నమ్మకం. అయితే, ఆ డబ్బులతో చిన్నారులు దుబారా ఖర్చులకు దిగకుండా ఎన్వలప్‌ను వెనక్కు తీసేసుకుంటారు. ఇక చిన్నారి విషయంలో కూడా ఇదే జరిగింది. చిన్నారికి ఇలా వచ్చిన డబ్బును జాగ్రత్త చేద్దామని బాలుడి తండ్రి తీసుకున్నాడు. ఇది చిన్నారికి సుతరామూ నచ్చలేదు.
Viral: వామ్మో.. ఇతడు మామూలోడు కాదు.. పామును ఎలా పట్టాడో చూస్తే..
దీంతో, మరో ఆలోచన లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు కోసం తనతో పేచీ పెట్టుకున్న చిన్నారి చివరకు పోలీసులకు ఫోన్ చేశాడని తండ్రి చెప్పాడు. దీంతో, వారు చిన్నారికి నచ్చ చెప్పారు. ‘‘ఆ డబ్బును నాన్న దగ్గరే ఉండనివ్వు. నీ కావాల్సినప్పుడు అడిగి తీసుకో. ఆ లెక్కలన్నీ నాన్నను చూసుకోనివ్వు.. ఒకేనా?’’ అని బాలుడికి నచ్చ చెప్పారు. పిల్లల పెంపకంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తండ్రికి కూడా సూచించారు. పిల్లలు ఇలాంటి చర్యలకు దిగకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.