Share News

Blinkit Ambulance: బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు అద్భుతం.. డాక్టర్ ప్రశంసలు

ABN , Publish Date - Feb 16 , 2025 | 08:19 PM

బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసులో పేషెంట్‌కు అత్యుత్తమ క్రిటికల్ కేర్ అందుతోందంటూ ఓ డాక్టర్ ప్రశంస ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Blinkit Ambulance: బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు అద్భుతం.. డాక్టర్ ప్రశంసలు

ఇంటర్నెట్ డెస్క్: క్విక్ కామర్స్‌కు ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. కాలుకదపకుండా కావాల్సినవన్నీ ఇంటివద్దకే వచ్చేస్తుండటంతో అందరూ క్విక్ కామర్స్ బాట పడుతున్నారు. ఫలితంగా బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో సంస్థల సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఈ రంగం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందని బిజినెస్ రంగ నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం కొత్త రంగాలకు విస్తరిస్తున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణే బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు. ఈ సేవలు ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నాయో ప్రశంసిస్తూ ఎయిమ్స్‌కు చెందిన ఓ డాక్టర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).


Viral: వామ్మో.. ఇతడు మామూలోడు కాదు.. పామును ఎలా పట్టాడో చూస్తే..

డా. దీపక్ అగర్వాల్ ఈ పోస్టు పెట్టారు. హెల్త్ కేర్ రంగంలో భారత్ ఎంతో కాలంగా ఎదురు చూసున్న విప్లవమే బ్లింకిట్ అంబులెన్స్ సర్వీసు అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం విషమంగా ఉన్న పేషెంట్‌ను బ్లింకిట్ అంబులెన్స్‌లో ఎలాంటి క్రిటికల్ కేర్ అందిందీ ఆయన వివరించారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రమే విన్న ఈ సేవలు ఇండియాలో కూడా అందుబాటులోకి రావడం అద్భుతమని అన్నారు.

సీ స్పైన్ స్టెబిలైజేషన్, లింబ్‌ను స్లింట్ చేయడం, లోపీకి ప్రాథమిక చికిత్స చేయడం వంటివన్నీ చేశారని, ఇలాంటి సర్వీసు పాశ్చాత్య దేశాల్లోనే ఉంటాయని అన్నారు.


Viral: రెండు చేతులూ పోగొట్టుకున్న మహిళ! సొరచేపతో ఫొటోలు దిగే ప్రయత్నంలో...

కాగా, ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎమర్జెన్సీ కేర్ సరిగా లేక తాము గతంలో అనేక ఇబ్బందులు పడేవారమని కొందరు తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఇలాంటి సర్వీసుల కారణంగా ఎందరి ప్రాణాలో నిలుస్తాయని అన్నారు. మరికొందరు తమ పోస్టుల్లో బ్లింకిట్ సీఈఓను ట్యాగ్ చేశారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Viral: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు

Read Latest and Viral News

Updated Date - Feb 16 , 2025 | 08:26 PM