Iranian woman transforms into Kajol: కాజోల్‌గా మారిన ఇరానియన్ మహిళ.. నెట్టింట్లో వీడియో వైరల్
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:02 PM
ఒక ఇరానియన్ మహిళ బాలీవుడ్ నటి కాజోల్ లాగా మారిపోయింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?
ఇంటర్నెట్ డెస్క్: ఒక ఇరానియన్ మేకప్ ఆర్టిస్ట్ బాలీవుడ్ నటి కాజోల్ లాగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. AI సహాయం లేకుండా ఆమె కాజోల్‌గా మారిపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో నసీమ్ అనే యువతి షేర్ చేసిన వీడియోలో, ఆమె కాజోల్ నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలోని లుక్‌లో కనిపించింది. యే లడ్కా హాయే అల్లా పాట నేపథ్యంలో వీడియో సాగుతుంది. ఆ వీడియోకు.. ఈరోజు కాజోల్‌గా మారేందుకు ట్రై చేశాను… విజయం సాధించానా? లేక ఇంకా బాగా ట్రై చేయాలా? అనే క్యాప్షన్ పెట్టింది.
ఆమె కాజోల్‌లా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంది. కాజోల్ హావభావాలను, ముఖ కవళికలను కూడా అద్భుతంగా అనుకరిస్తూ తన టాలెంట్‌ను ప్రదర్శించింది. ఈ వీడియోకు ఇప్పటికే 30 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది నసీమ్ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. కొంతమంది అయితే ఇది AI కంటే కూడా బెటర్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read:
పాక్ మాజీ క్రికెటర్ అసభ్యకర భాష.. సూర్యకుమార్ యాదవ్‌పై తీవ్ర విమర్శ
కేటీఆర్‌పై కుట్ర జరుగుతోంది.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
For More Latest News