Internet Shut down: రేపు ఇంటర్నెట్ పూర్తిగా బంద్ అవుతుందా.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 15 , 2025 | 09:40 PM
ఒక కార్టూన్ వీడియోలో చేసిన అంచనా ఆధారంగా జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తేదీ దగ్గరకు రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే అది నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న వీడియోలలో రేపు (జనవరి 16, 2025న) ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా బంద్ (Internet Shut down) అవుతుందని ఒక వాదన తెర మీదకొచ్చింది. ఈ వాదనకు మూలం ది సింప్సన్స్ అనే ప్రముఖ కార్టూన్ షోలోని ఒక ఎపిసోడ్ వీడియోలో చూపించబడిన దానిలో ఒక షార్క్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్‌ను కత్తిరించి, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపబడుతుందని చెప్పబడింది. ఈ వీడియో ఈ సంఘటనను కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి యాడ్ చేశారు.
గతంలో నిజం అయిన వేళ...
ది సింప్సన్స్ అనే టీవీ షో అనేది ప్రపంచంలోనే ప్రముఖ యానిమేటెడ్ షోలలో ఒకటిగా ఉంది. ఈ షో ఇప్పటివరకు ఎన్నో కీలకమైన విషయాలను అంచనా వేసింది. అందులోని పలు సంఘటనలు నిజ జీవితంలో కూడా చోటుచేసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఆగ్నేయ ఆసియాలో వచ్చిన సునామీలు, 9/11 దాడులు వంటి అనేక సంఘటనలు ఈ షోలో ముందే చూపించారు. దీంతో ది సింప్సన్స్ అంచనాలు ఇప్పుడు కూడా నిజం అవుతాయని పలువురు భావిస్తున్నారు. దీంతో ఈ అంశంపై అనేక మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజమా కాదా..
ఇప్పుడు ఈ ది సింప్సన్స్ షోలోని అంచనాలను ఆధారంగా చేసుకుని జనవరి 16న ఇంటర్నెట్ బంద్ అవుతుందన్న వాదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక్కసారిగా కట్ అవుతాయని పేర్కొనబడింది. కానీ ఈ వాదనకు ఎటువంటి ఆధారం లేదు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం 2025 జనవరి 16న కాకుండా 2025 జనవరి 20న జరగబోతుంది. ఈ విషయంపై ఇంటర్నెట్ షట్‌డౌన్ అవ్వడం అనేది పూర్తిగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంక్షోభం ఏ ఒక్కరికీ వర్తించదని, నిపుణులు ఈ వాదనను ఖండిస్తున్నారు.
నిపుణుల సూచన..
'ది సింప్సన్స్' అలాంటి అంచనాలు వేయలేదని, దీనికి ఆధారం అయిన వీడియో ఒక క్రియెటర్ వీడియో అని చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 16న ఇంటర్నెట్ నిలిపివేయబడుతుందనే వాదనలో నిజం లేదని అంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే నిరాధారమైన వీడియోలు, వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వైరల్ వీడియోల ఉద్దేశం సంచలనం సృష్టించడం ద్వారా వీక్షణలను పొందడం మాత్రమేనని అంటున్నారు. ఎలాంటి ధృవీకరణ లేకుండా అలాంటి వీడియోలను మరింత షేర్ చేయవద్దని, వాటిని నమ్మవద్దని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: కుంభమేళా యాత్రికులకు కొత్త వెబ్ యాప్.. లాగిన్ లేకుండా ఘాట్‌లు, పార్కింగ్ సమాచారం..
Lay offs: ఈ కారణంతో వేల మందిని తొలగిస్తున్న మెటా.. ఉద్యోగుల ఆగ్రహం..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News