Share News

Kumbh Mela 2025: కుంభమేళా యాత్రికులకు కొత్త వెబ్ యాప్‌.. లాగిన్ లేకుండా ఘాట్‌లు, పార్కింగ్ సమాచారం..

ABN , Publish Date - Jan 15 , 2025 | 06:24 PM

మహా కుంభమేళా 2025 యాత్రికుల కోసం ఎస్రి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కుంభలొకేటర్ అనే వెబ్ యాప్‌ను ప్రారంభించింది. దీనిలో లాగిన్ కాకుండానే ఈ యాప్ వినియోగించడం ప్రత్యేకత. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Kumbh Mela 2025: కుంభమేళా యాత్రికులకు కొత్త వెబ్ యాప్‌.. లాగిన్ లేకుండా ఘాట్‌లు, పార్కింగ్ సమాచారం..
ESRI India Kumbh Locator Web App

ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి మహా కుంభమేళా (Kumbh Mela 2025). ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఈ వేడుక జరుగుతోంది. ఈ ఉత్సవానికి ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే యాత్రికులకు ఆధ్యాత్మిక ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ఎస్రి ఇండియా కొత్తగా ‘కుంభలొకేటర్’ ( https://kumbhlocator.esri.in/) అనే వెబ్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్ యాత్రికులకు కీలకమైన సమాచారాన్ని ఒకే చోట అందించడానికి రూపొందించబడింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు సులభంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో కుంభమేళా పరిసరాల్లో ఉండే అనేక సౌకర్యాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.


సులభమైన నావిగేషన్

ఎస్రి ఇండియా రూపొందించిన ‘కుంభలొకేటర్’ వెబ్ యాప్ యాత్రికులకు, మహా కుంభమేళా ప్రాంతాన్ని సులభంగా నావిగేట్ చేయడానికి అనేక సహాయాలను అందిస్తుంది. ఈ యాప్‌లో భాగంగా యాత్రికులు స్నానపు ఘాట్‌లు, పార్కింగ్, రోడ్లపై ప్రత్యక్ష ట్రాఫిక్ సమాచారం, వాతావరణ తాజా సమాచారం తెలుసుకోవచ్చు. దీంతోపాటు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, తప్పిపోయిన, దొరికిన కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రులు, ఇ-రిక్షా స్టాండ్‌లు వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలను ఈ యాప్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.


అంతర్జాల ఆధారిత సమాచార సౌకర్యాలు

ఈ వెబ్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషులో అందుబాటులో ఉంది. ఈ వెబ్ యాప్‌ను యాత్రికులు ఎటువంటి లాగిన్ లేదా డౌన్లోడ్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. యాత్రికులు వారి ఫోన్లలో వెబ్ యాప్‌ను ప్రదర్శించడం ద్వారా సులభంగా వారి గమ్య స్థానానికి చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్‌లా ఇది ఇంటరాక్టివ్, రియల్-టైమ్ మ్యాప్‌లను అందిస్తుంది. తద్వారా యాత్రికులు సులభంగా ఆయా ప్రదేశాలకు నావిగేట్ అవుతారు. మహా కుంభమేళా సందర్శకుల కోసం అతి ముఖ్యమైన సమాచారం ఈ యాప్‌లో పొందుపరచబడింది.


భద్రతపై ఫోకస్

భద్రత కోసం కూడా ఈ యాప్ కీలకమైన సేవలను అందిస్తుంది. పుణ్యక్షేత్రంలో విస్తృతంగా ఉండే ప్రజల రద్దీని అధిగమించి, యాత్రికులు సురక్షితంగా ఉండేందుకు అన్ని సూచనలు ఈ యాప్ ఇవ్వగలదు. తప్పిపోయిన, దొరికిన కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రుల ప్రదేశాలు ఈ యాప్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. ఇది యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని తక్కువ సమయంలో ఇవ్వడానికి ఎస్రి ఇండియా అభివృద్ధి చేసింది. “మా లక్ష్యం, కుంభమేళాకు వచ్చే లక్షలాది యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడం. ఈ వెబ్ యాప్ ద్వారా అన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని ఒకే చోట అందించి, యాత్రికులకు తక్కువ సమయంలో అత్యంత సురక్షితమైన సేవలను అందించగలగడడని ఎస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

Lay offs: ఈ కారణంతో వేల మందిని తొలగిస్తున్న మెటా.. ఉద్యోగుల ఆగ్రహం..

SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 15 , 2025 | 06:26 PM