Share News

Bangladesh: దీపు‌ చంద్ర దాస్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన వీడియో

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:38 PM

గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. భారత వ్యతిరేక విద్యార్థి హడీ మరణం తర్వాత అతని మద్దతుదారులు రెచ్చిపోయారు. దైవ దూషణ ఆరోపణపై ఒక హిందూ బెంగాలీ కార్మికుడు దీపు చంద్ర దాస్ ని దారుణంగా హత్య చేశారు.

Bangladesh: దీపు‌ చంద్ర దాస్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన వీడియో
Mymensingh mob attack

బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిందూ బెంగాలీ (Hindu Bengali) కార్మికుడు (Worker) దీపు చంద్ర దాస్ (25) (Deepu Chandra Das) దైవదూషణ చేశాడని ఆరోపణపై జరిగిన మూకదాడి (Mob attack)అత్యంత విషాదకరమైంది. చంద్ర దాస్ చివరి క్షణాలకు సంబంధించి ఓ భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ (Viral) అవుతుంది.ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఛానల్ (Popular news channel) విడుదల చేసింది. ఈ వీడియోలో దీపు చంద్ర దాస్ పని చేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల (Outside the factory) వందల సంఖ్యల్లో జనసమూహం కనిపిస్తుంది.


ఎప్పుడైతే ఫ్యాక్టరీ నీలం రంగు తలుపులు (Doors) తెరిచారో.. దీపును గుంపు చుట్టుముట్టి విచక్షణారహితంగా (Attack) కొట్టిచంపారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆ గుంపు హిందూ(Hindu) వ్యక్తిని కొట్టి చంపిన తర్వాత నగ్నంగా చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించినట్లు పేర్కొన్నాయి.పరిస్థితి తీవ్ర రూపం దాల్చడం వల్ల పోలీసులు (Police) అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోర కలకలంపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ హత్యకు సంబంధించిన రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) పదిమంది అనుమానితులను అరెస్టు(Arrest) చేసినట్లు తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి

భారత్‌ నుంచి పెరుగుతున్న శాశ్వత వలసలు.. ఏటా 2 లక్షల మందికి పైగా...

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్స్.. క్షమాపణ చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం

For More Prathyekam And Telugu News

Updated Date - Dec 22 , 2025 | 12:38 PM