Buffalo City Guinness Records: భలే గిన్నిస్ రికార్డు! ఏ రేంజ్‌లో చికెన్ వింగ్స్ తిన్నారంటే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:55 AM
న్యూయార్క్‌లోని బఫెలో నగరం సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. అత్యధిక మంది పాల్గొన్న చికెన్ వింగ్స్ ఈటింగ్ కాంపిటీషన్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో 499 మంది పాల్గొని నోరూరించే బఫెలో చికెన్ వింగ్స్‌ను తెగ తినేశారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లోని బఫెలో నగరం.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది చికెన్ వింగ్సే. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే చికెన్ వింగ్స్ స్నాక్స్.. బఫెలో వింగ్స్‌గా ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. తాజాగా ఈ నగరం అతిపెద్ద చికెన్ వింగ్స్ ఈటింగ్ కాపిటీషన్‌ను నిర్వహించిన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఆహార ప్రియులకు ఓ తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ పోటీలో పాల్గొన్న జనాలు చికెన్ వింగ్స్‌ను తెగ తిసేసి ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు (Buffalo City Chicken Wings Eating Competition - Guinness Records).
సామాజిక సేవకు నిధుల సమీకరణ కార్యక్రమాల్లో భాగంగా రెవాలెస్ ఫ్యామిలీ పౌండేషన్ ఈ పోటీలను నిర్వహించింది. బఫెలో సంస్కృతికి అద్దం పట్టే నేషనల్ బఫెలో వింగ్ ఫెస్టివల్ వ్యవస్థాపకుడు డ్రూ సెర్జా ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చారు. ఈ పోటీలో ఈసారి ఏకంగా 499 మంది పాల్గొన్నారు. చికెన్ వింగ్స్‌పై తమకున్న ఇష్టత చాటుకుంటూ తెగ తినేశారు. ఒక వ్యక్తి కేవలం 5 నిమిషాల్లో 36 చికెన్ వింగ్స్ తినేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో ఇదే తరహాలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో 397 మంది పాల్గొన్న పోటీలో నెలకొల్పిన రికార్డును తాజా కార్యక్రమం అధిగమించింది. ఈ విషయాన్ని గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధి ధ్రువీకరించారు.
బఫెలో వింగ్స్ చరిత్ర ఇదీ
చికెన్ వింగ్స్‌ను వెనిగర్, కారం, హాట్‌సాస్ మిశ్రమంతో కలిపి డీప్ ఫ్రై చేసి బఫెలో వింగ్స్‌ను తయారు చేస్తారు. 1964లో దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రుచి జనాలందరికీ నచ్చడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది. వేడి వేడి బఫెలో చికెన్ వింగ్స్‌ను సెలరీ చెట్టు కాడలతో కలిపి తినడం సంప్రదాయంగా వస్తోంది.
ఇవీ చదవండి
కిడ్నీలను టచ్ చేసిందిగా.. పాక్ మహిళా ఆఫీసర్‌పై ట్రోలింగ్
ఎంత దారుణం! ఐదుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలపై కనికరం లేకుండా..