Teacher Accuses Checker Of Harassment: రైల్లో టికెట్ అడిగినందుకు.. వేధిస్తున్నాడని ఆరోపించిన మహిళ
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:39 PM
వెంటనే అప్రమత్తమైన టీటీఈ వ్యవహారం ఏదో తేడా ఉందని గ్రహించి ముందుగానే వీడియో తీయడం మొదలు పెట్టాడు. మీరు ఏసీ కోచ్ లో ప్రయాహిస్తున్నారు.. టికెట్ ఎక్కడ? అని ప్రశ్నించారు.
రైల్లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణించడమే కాకుండా, టికెట్ చూపించమని అడిగిన రైల్వే టికెట్ ఎగ్జామినర్ (TTE) తనను వేధిస్తున్నాడని ఆరోపించిన ఘటన బిహార్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రైల్లో ఏసీ భోగిలో ప్రయాణం చేస్తోంది. ట్రైన్ లో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ ప్యాసింజర్స్ దగ్గర టికెట్ ఉందొ లేదో చెక్ చేస్తూ ఆ మహిళను కూడా అడిగాడు. సదరు మహిళ టికెట్ చూపించక పోగా, టీటీఈ తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. వెంటనే అప్రమత్తమైన టీటీఈ వ్యవహారం ఏదో తేడా ఉందని గ్రహించి ముందుగానే వీడియో తీయడం మొదలు పెట్టాడు. మీరు ఏసీ కోచ్ లో ప్రయాహిస్తున్నారు.. టికెట్ ఎక్కడ? అని ప్రశ్నించారు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని సదరు మహిళ.. టీటీఈ తనను ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తున్నాడని ఆరోపించసాగింది.
'మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఉద్దేశపూర్వకంగా వేధించడానికి ఇలా చేస్తున్నారు.' అని మహిళ టీటీఈపై మండిపడింది. ఆమె మాటలపై స్పందించిన టీటీఈ 'ఇది ఇబ్బంది పెట్టడం గురించి కాదు. మీ వద్ద టికెట్ లేదు. మీరు ఇంతకుముందూ టికెట్ లేకుండా ప్రయాణించారు. మీరు బీహార్ ప్రభుత్వంలో టీచర్. నాకు తెలుసు' అని జవాబిచ్చారు. ఆ వెంటనే మహిళ మాట్లాడుతూ.. 'మీరు అబద్ధం చెబుతున్నారు. నేను ఎలాంటి అబద్ధం చెప్పడం లేదు.' అని టీటీఈకి ఎదురుగా మాట్లాడింది. టీటీఈ స్పందిస్తూ.. 'నాకు బాగా గుర్తుంది. మీరు బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మీరు తరచూ టికెట్ లేకుండా ప్రయాణిస్తారు. మీ దగ్గర టికెట్ ఉంటే చూపించండి.' అని నిలదీశారు. టీటీఈ జరుగుతున్నదంతా తన మొబైల్‌లో రికార్డు చేస్తున్నాడు. అది గమనించిన మహిళ గుర్తించి 'మీ ఫోన్ చూపించండి. ఇలా వీడియో తీయకండి' అంటూ ఎదురు తిరిగింది. జాగ్రత్త పడిన టీటీఈ తనకు తాకొద్దంటూ హెచ్చరించాడు.
కొద్దిసేపు గొడవపెట్టుకున్న మహిళ, 'నేను వెళ్తున్నా. మీరు ఒక మహిళను వేధిస్తున్నారు' అంటూ మళ్ళీ అలాగే మాట్లాడింది. “నేను వేధిస్తున్నానా? మీ దగ్గర టికెట్ లేదు. నేను మిమ్మల్ని స్లీపర్ కోచ్‌కి వెళ్లమని చెబుతున్నా, మీరు వెళ్ళడం లేదు. పైగా నేను వేధిస్తున్నానని అంటున్నారు.” అంటూ టీటీఈ హెచ్చరించారు. కోపోద్రిక్తురాలైన మహిళ.. 'నేను వెళ్లకపోతే ఏమి చేస్తారు? మీరు చాలా సేపు నన్ను వేధిస్తున్నారు. మీరు వీడియో తీస్తున్నారని నాకు తెలుసు.' అంటూ మాట్లాడసాగింది. మరోమారు టీటీఈ మాట్లాడుతూ .. “తప్పకుండా తీస్తున్నాను. మీరు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నారు. అంతే కాదు, ఇప్పుడు మీరు వేధింపులంటున్నారు.” అంటూ గట్టిగా మాట్లాడారు. ఎలాగోలా ఇక్కడినుంచి తప్పించుకోవాలని భావించిన మహిళ చివరికి మహిళ తన బ్యాగ్ తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి...
న్యూయార్క్ సూపర్‌మార్కెట్‌లో షాకింగ్ సీన్.. కస్టమర్ల మధ్య తీవ్ర ఘర్షణ.. వైరల్ వీడియో
హోటల్‌లో ఊహించని సంఘటన.. వెయిట్రెస్ సకాలంలో స్పందించటంతో..
Read Latest Pratyekam News And Telugu News