Groom scared: పాపం.. వరుడు ఎంత భయపడ్డాడో.. అందరూ ఎలా నవ్వుకున్నారో చూడండి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:32 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా అలరిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (funny wedding video).
golu_barwal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి జరుగుతోంది. వేదికపై వధూవరుల వరమాల కార్యక్రమం జరుగుతోంది (garland ceremony). వరుడి మెడలో వధువు దండ వేసింది. ఆ తర్వాత వధువు మెడలో వరుడు దండ వేస్తుండగా.. పక్కనే టపాసు పేల్చారు. భయపడిన వరుడు పక్కకు తూలిపోయాడు. వెంటనే ఆ టపాసు కాల్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చుట్టూ ఉన్న వారు వరుడిని శాంతింప చేసి వధువుపై దండ వేయాలని సూచించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. 46 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. పాపం.. అతడిని ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వడం లేదని ఒకరు కామెంట్ చేశారు. అతడు చాలా భయపడ్డాడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..