New York Costco fight: న్యూయార్క్ సూపర్‌మార్కెట్‌లో షాకింగ్ సీన్.. కస్టమర్ల మధ్య తీవ్ర ఘర్షణ.. వైరల్ వీడియో
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:48 PM
న్యూయార్క్‌లోని కాస్ట్‌కో స్టోర్‌లో ఇద్దరు కస్టమర్‌ల మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌లోని కాస్ట్‌కో స్టోర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పచారీ సామాన్లు కొనుక్కునేందుకు కాస్ట్‌కోకు వెళ్లిన కస్టమర్ల మధ్య తెలెత్తిన ఘర్షణ చివరకు హింసాత్మకంగా మారింది. వస్తువులు పెట్టుకునే కార్ట్ దారికి అడ్డంగా ఉండటంతో ఈ ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది (Newyork Costco Fight).
మీడియా కథనాల ప్రకారం, న్యూయార్క్‌లోని సన్‌సెట్ పార్క్‌లో గల కాస్ట్‌కో స్టోర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘర్షణ జరిగింది. వస్తువులు పెట్టుకునే కార్టు అడ్డంగా పెట్టడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఓ ఆఫ్రికాజాతీయుడు మరో వ్యక్తిని తోసి, ముష్టిఘాతాలు కురిపించాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను కూడా తోసే ప్రయత్నం చేశాడు (Viral Video).
ఆఫ్రికా సంతతి వ్యక్తి దాడి కారణంగా బాధితుడి నుదురు, కంటి రెప్పపై గాయం అయ్యింది. అయితే, పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ ఆఫ్రికా సంతతి వ్యక్తితో పాటు అతడితో పాటు ఉన్న మహిళ పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గాయపడ్డ వ్యక్తికి ఎన్‌వైయూ లాంగోన్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
కాగా, కాస్ట్‌కో స్టోర్‌లో మనుషులు సంచరించేందుకు సరిపడా స్థలం లేకపోవడమే ఈ గొడవకు అసలు కారణమని నెట్టింట కొందరు కామెంట్ చేశారు. అక్కడి వస్తువులన్నీ ఇష్టారీతిన పేర్చారని, కస్టమర్లు నడిచేందుకు కూడా స్థలం లేనట్టు కనిపించిందని అన్నారు. కస్టమర్లు అప్పటికే ఇబ్బంది పడుతున్న విషయాన్ని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
దరిద్రంలో మగ్గుతుండగా బంపర్ లాటరీ.. ఆ సంబరంలో ఉండగానే ఊహించని షాక్
వీళ్లసలు మనుషులేనా.. అర్ధరాత్రి రైల్లో ఈ మహిళలు ఎలా రెచ్చిపోయారో చూస్తే..