Indian Railway Video: వీళ్లసలు మనుషులేనా.. అర్ధరాత్రి రైల్లో ఈ మహిళలు ఎలా రెచ్చిపోయారో చూస్తే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:12 PM
అర్ధరాత్రి రైల్లో కొందరు మహిళ పెద్ద పెట్టున మాట్లాడుతూ, నవ్వుకుంటూ తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు పౌర స్పృహ తక్కువన్న కామెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు ఉదంతాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కోవకు చెందిన మరో షాకింగ్ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. భారతీయ రైలు ప్రయాణికుడు ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. అర్ధరాత్రి రైల్లో కొందరు మహిళా ప్రయాణికులు ఇతరులను ఎంతలా ఇబ్బంది పెట్టారో తన పోస్టులో చెప్పుకొచ్చారు (noisy co-passengers Indian Railways).
ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో సదరు ప్రయాణికుడు ఈ పోస్టు పెట్టారు. తాను ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నానని అన్నారు. దసరా సెలవుల తరువాత మళ్లీ యూనివర్సిటీకి వెళుతుండగా అర్ధరాత్రి వేళ రైల్లో కొందరు మహిళా ప్రయాణికులు ఇష్టారీతిన వ్యవహరించారని అన్నారు (train etiquette).

‘వాళ్లు అర్ధరాత్రి వేళ ఇష్టారీతిన నవ్వుకుంటూ, పెద్దగా కబుర్లు చెప్పుకుంటూ తోటి ప్రయాణికులకు నిద్ర లేకుండా చేశారు. పక్కన వారి నిద్ర చెడిపోతోందన్న స్పృహ వారిలో కనిపించలేదు. ‘మేము టిక్కెట్ తీసుకుని రైలెక్కాము. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము’ అని వారిలో ఒకరు అన్నారు. అర్ధరాత్రి 2 గంటల వేళ వివాదం పెద్దదైంది. కొందరు ఆ మహిళలతో గొడవకు దిగారు. వారి ప్రవర్తన సరికాదని, వాళ్లకు సంస్కారం లేదని మండిపడ్డారు. దీంతో, ఘర్షణ మరింత పెరిగింది. ఈ గొడవ చాలా సేపు సాగడంతో మిగతా వారికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు’ అని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు (loud conversations train).
ఇక ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ‘నాకూ ఇలాంటి అనుభవమే ఒకసారి ఎదురైంది. భారత్‌లో జర్నీ చేస్తున్నామంటే కచ్చితంగా కాటన్‌తో రెడీగా ఉండాలి. పక్కవారి ఇబ్బందిని ఖాతర చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించేవారికి మన దేశంలో కొదవేమీ లేదు’ అని ఓ వ్యక్తి అన్నారు. ‘ఇలాంటప్పుడు మీరు కూడా పెద్ద శబ్దంతో సాంగ్ ప్లే చేసి గోల చేస్తేనే వారికి బుద్ధి వస్తుంది. ఇలాంటి వారికి అదే మంచి మందు’ అని మరో వ్యక్తి అన్నారు. భారతీయుల్లో పౌర స్పృహ చాలా తక్కువని మరికొందరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ప్రస్తుతం ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి:
ఈ రాజుకు 15 మంది భార్య.. షాకింగ్ వీడియో వైరల్
భారతీయులను స్విట్జర్‌ల్యాండ్ హోటల్ ఇలా అనేసరికి నేను హర్ట్ అయ్యా.. ఓ డాక్టర్ ఆవేదన