Holi: ఆనందాల రంగులకేళి.. హోలీ
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:44 AM
ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పండుగ కాస్త విషాదానికి దారి తీసే పరిస్థితులున్పాయి.

హైదరాబాద్: హోలీ పండుగ(Holi Festival) వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతూ పేద, ధనిక తారతమ్యం లేకుండా ఉత్సాహంగా ఈ వేడుకను జరుపుకుంటారు. భిన్న మతాలు, ప్రాం తాలు, భాషలు మాట్లాడే వారితో భిన్నత్వం లో ఏకత్వంలా కనిపించేభాగ్యనగరంలో ఈ వేడుకను నూతనోత్సాహంతో జరుపుకోవడం విశేషం.
అప్పటి నుంచే వేడుకలు
హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ ఏడాది పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ వస్తుంది. ఈ ఏడాది మార్చి 14న వచ్చింది. అయితే సత్య యుగం నుంచి జరుపుతున్నారు. ఈ సమయంలో కాముని దహనం, డోలికోత్సవం వేడుకలను కూడా జరుపుకొంటారు. ఈ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పే వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: Electricity: ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడైతే డీఈ, ఏడీఈలకు ‘షాక్’ తగులుద్ది మరి..
పౌర్ణమి తిథినాడు పశ్చిమ బెంగాల్(West Bengal)లో హోలీ రోజు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి డోలికోత్సవం నిర్వహిస్తారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎలాగైన చంపాలని సోదరి హోలికను పంపుతాడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చొబెట్టుకుని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణు నామ స్మరణలో ఉన్నందున ప్రహ్లాదుడికి ఏమి కాదు, కానీ హోలిక మాత్రం మంటల్లో కాలి బూడిద అవుతుంది. ఇలా చెడు అంతానికి సంకేతంగా కామదహనంగా హోలీ నిర్వహిస్తారు.
బంధుత్వాలను, స్నేహాలను..
హోలీ రోజున రంగులు పూసుకోవడంతో బంధుత్వాలను, స్నేహాలను మరింత దగ్గర చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులు, రంగులతో ఈ ఉత్సావాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెబుతారు. ఇలా రంగులు, పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వలన స్నేహబంధాలు, ప్రేమ, సౌభాగ్యాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం.
జాగ్రత్తలు అవసరం..
అయితే ఈ రంగుల పండుగలో వినోదాలతో పాటు ఆనందమయ హోలీ జరుపుకోవాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తత అవసరమని వైద్యులు చెబుతున్నారు. రంగులు పర్మినెంట్‌గా ఉండాలని కొందరు రంగులకు బదులుగా కెమికల్ కలర్స్ వాడు తుండడంతో చర్మ, జుట్టు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్త్రలు అవసరమని వైద్యులు చెబుతున్నారు
వరుస సెలవులు వస్తుండడంతో ఊర్లకు ప్లానింగ్..
ఈ నెల 14 హోలీ సందర్భంగా సెలవు దినం కావడం మరుసటి రోజు శనివారం ఆదివారం కావడంతో హోలీతో పాటు మూడు రోజులు తమ సొంత ఊర్లలో ఆనందగా గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్ళకు టికెట్లకు రద్దీ పెరిగింది. మరి కొందరు సొంత వాహనాల ద్వార ఊర్లకు సిద్దమౌతుంటే మరి కొందరు ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని ఊర్లకు వెళ్లేందుకు సిద్ద పడుతున్నారు.
ఇలా చేస్తే మంచిది..
1. ఈ వేడుకల్లో నీటిలో కరిగిపోయే రంగులను వాడితే మంచిది. పర్మినెంట్ కలర్స్‌లో డైస్ వినియోగం ఎక్కువగా ఉన్నందున రియాక్షన్, ఇన్‌ఫెక్షన్, ఎలర్జీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2. రంగులు కళ్లు, నోరు, ముక్కు చెవులలో పడకుండా జాగ్రత్త పడడం మంచిది.
3. రంగుల వలన ఎలర్జీ వస్తే వెంటనే రంగులను నీటితో కడిగి, మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోవాలి.
4. జుట్టుపై రంగు పడకుండా కప్పెసు కోవాలి. ఒక వేళ రంగులు పడితే జట్టు చిట్లి పోవడం, ఊడి పోయే ప్రమాదం ఉంది కాబట్టి హోలీ ఆడిన అనంతరం షాంపూతో,గానీ కోడి గుడ్డుతో గానీ తలంటుకుని మంచి కండిషనర్‌ను వాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News