Electricity: ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడైతే డీఈ, ఏడీఈలకు ‘షాక్’ తగులుద్ది మరి..
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:14 AM
ప్రస్తుత వేసవి సీజన్ లో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆవాంతరాలు లేకుండా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్కపైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడైతే డీఈ, ఏడీఈలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

- క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారుల సమీక్షలు
హైదరాబాద్ సిటీ: వేసవిలో డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(Distribution Transformers) ఎక్కడ ఓవర్‌లోడ్ అయినా సంబంధిత డీఈ, ఏడీఈలపై చర్యలు తీసుకునేలా దక్షిణ డిస్కం(South Discom) చర్యలు చేపట్టింది. సమ్మర్ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ సాధారణం కంటే 25 నుంచి 30 శాతం పెరుగుతుందనే ముందస్తు అంచనాలతో గ్రేటర్(Greater)లో కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నీటి వృథా.. మహిళకు జరిమానా
10 సర్కిళ్ల పరిధిలో రూ.600 కోట్ల నిధులతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు చేపట్టారు. వందల సంఖ్యలో ఫీడర్ల విభజన చేపట్టి కొత్త విద్యుత్ లైన్లు వేశారు. ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు దక్షిణ డిస్కం ఉన్నతాధికారులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల ఉన్నతాధికారులు డీఈ, ఏడీఈ, ఏఈ(DE, ADE, AE)లతో రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. థర్మల్ స్కానింగ్ యంత్రాలతో ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఓవర్ లోడ్ అయ్యే అవకాశాలు ఉండవని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముందస్తు చర్యలు చేపట్టని డీఈ, ఏడీఈలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News