Fiverr CEO: ఏఐతో జాబ్స్ పోవడం పక్కా అంటున్న ప్రముఖ సంస్థ సీఈఓ
ABN , Publish Date - May 06 , 2025 | 10:46 PM
ఏఐ రాకతో పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తున్నాయని ఫైవర్ సంస్థ సీఈఓ తన ఉద్యోగులను హెచ్చరించారు. ఇందుకు తగినట్టు ఉద్యోగులు తమని తాము మలుచుకోకపోతే ఉద్యోగాలు పోవడం పక్కా అని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రీలాన్స్ మార్కెట్ ప్లేస్ ఫైవర్ సీఈఓ మిచా కాఫ్మన్ తాజాగా ఏఐతో జాబ్ మార్కెట్‌పై పడే ప్రభావం గురించి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ కాలానికి తగినట్టుగా మార్పు చెందాలని కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు తన సంస్థలోని వారికి పంపించిన అంతర్గత నోటీసు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోందని, గిగ్ వ్యవస్థతో సహా అనేక రంగాల్లో సమూల మార్పులకు దారి తీస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్లు, ఉద్యోగులు చేసే పనులను భవిష్యత్తులో ఏఐ చక్కబెట్టే స్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే, పరిస్థితులకు అనుగూణంగా మారేవారికి ఏఐతో కొత్త అవకాశాలు కూడా వస్తాయని పేర్కొన్నారు.
‘‘మనందరం వినడానికి ఇష్టపడని వాస్తవం ఇది. ఏఐతో మీ ఉద్యోగాలకు ముప్పు తప్పదు. నా జాబ్‌కు రిస్క్ పొంచి ఉంది. ఇది మనందరికీ ఓ మేలు కొలుపు. డిజైనర్, ప్రాడక్ట్ మేనేజర్, డాటా సైంటిస్ట్, లాయర్, కస్టమర్ సపోర్టు రిప్రజెంటేటివ్, సేల్స్‌పర్సన్, ఫైనాన్స్ ఉద్యోగి.. ఇలాంటి వారి జాబ్స్‌కు ఏఐ ముప్పు ఉంది. ఒకప్పుడు మనం ఈజీ అనుకున్న ఉద్యోగాలన్నీ కనుమరుగవుతాయి. ఒకప్పుడు కష్టంగా భావించిన పనులన్నీ సులభంగా మారిపోతాయి. అసాధ్యమైన పనులన్నీ కష్టసాధ్యంగా మారతాయి. మీరు చేసే పన్నుల్లో అత్యద్భుతమైన నైపుణ్యం సాధించకపోతే నెలల వ్యవధిలోనే మీ కెరీర్ మొత్తం మారిపోవచ్చు. తలకిందులవ్వొచ్చు’’ అని ఆయన అన్నారు.
వివిధ రంగాల వృత్తి నిపుణుల తమ రంగాల్లోని ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందులో విఫలమైతే ఉద్యోగుల పని విలువ తగ్గిపోతుందని అన్నారు. ఉద్యో్గులు ప్రస్తుతం మరింత సమర్థవంతంగా వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రామ్ట్ ఇంజినీరింగ్‌లో నైపుణ్యాలు పెంచుకుని, వివిధ ఎల్ఎల్‌ఎమ్ మోడళ్లను తమ పనిలో భాగం చేసుకోవాలని సూచించారు. గూగుల్ లాంటి సంప్రదాయిక సాధనాలకు విలువ తగ్గిపోతోందని, ఏఐ వైపు మళ్లలేని వారు తమ నైపుణ్యాలకున్న విలువను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన సూచనను పక్కన పెట్టేవారు తమ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటారని కూడా స్పష్టం చేశారు. తన సూచనపై లోతుగా ఆలోచించాలని ఉద్యోగులను అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి:
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..