Share News

Wine to 3 Year Old: మూడేళ్ల చిన్నారికి విమానంలో మద్యం.. తల్లి గుస్సా

ABN , Publish Date - May 09 , 2025 | 04:13 PM

కాథే పసిఫిక్ విమానంలో ఓ మూడేళ్ల చిన్నారికి సిబ్బంది పొరపాటున మద్యం ఇవ్వడం వివాదానికి దారి తీసింది.

Wine to 3 Year Old: మూడేళ్ల చిన్నారికి విమానంలో మద్యం.. తల్లి గుస్సా

కాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ విమానంలో ఇటీవల భారీ తప్పిదం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న మూడేళ్ల బాలుడికి ఫ్లైట్ సిబ్బంది మద్యం ఇవ్వడం కలకలానికి దారి తీసింది. హాంకాంగ్ నుంచి లండన్‌కు ఏప్రిల్ 24న వెళుతున్న ఓ విమానంలో ఈ ఘటన జరిగింది.

అసలు ఆ రోజున ఏం జరిగిందో బాలుడి తల్లి మిస్ వాంగ్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. క్యాథే ఎయిర్‌వేస్‌కు తప్పు తెలిసొచ్చాక కూడా ఘటనపై సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. ‘‘క్యాథే సంస్థ క్షమాపణలు చెప్పింది కానీ అసలు ఈ ఘటన ఎందుకు జరిగిందో, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారనే విషయం మాత్రం చెప్పలేదు.’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్కహాల్ వల్ల పిల్లలపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం ఉంటుందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను స్పెషలిస్టులతో అత్యాధునిక చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.


నీళ్లు అనుకుని తమ బిడ్డ పక్కన వైట్ వైన్ గ్లాస్ పెట్టారని, దుర్వాసన వస్తోందని చిన్నారి ఫిర్యాదుతో డౌటొచ్చి పరిశీలిస్తే అది వైన్ అన్న విషయం తెలిసిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. జరిగిన దానికి విమాన సిబ్బంది క్షమాపణలు చెప్పినప్పటికీ తాము బిడ్దకు వైద్య పరీక్షలు చేయించాలని కోరామని చెప్పారు.

కాగా, ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లించడంతో పాటు వారికి డిస్కౌంట్ వోచర్లను కూడా ఆఫర్ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని తెలిపింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని, దీనిపై అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.


ఈ ఘటన సంస్థలోని వ్యవస్థాగత లోపాలను బయటపెట్టిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సరైన ఉద్యోగులను నియమించుకుని వారికి శిక్షణ ఇవ్వకపోవడం కనిపిస్తోందని అంటున్నారు. చిన్నారులతో విమాన ప్రయాణాల సందర్భంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు

వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

Read Latest and Viral News

Updated Date - May 09 , 2025 | 04:21 PM