-
-
Home » Prathyekam » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across globe 15Th oct 2025 kjr
-
BREAKING: మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం
ABN , First Publish Date - Oct 15 , 2025 | 06:03 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 15, 2025 20:28 IST
నాగర్‌కర్నూలులో దారుణం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
ప్రియుడు సురేష్‌తో కలిసి భర్త రాములు(35)ను చంపించిన భార్య మాసన
రాములు మద్యం తాగించి ఊపిరిఆడకుండా చేసిన హత్యచేసిన సురేశ్
ప్రాణం పోయిన తర్వాత రాములుకు గాయాలు చేసిన నిందితులు
బైక్‌తో సహా రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితులు
భార్య మాసన, ప్రియుడు సురేశ్‌తో తోపాటు మరో ఇద్దరు అరెస్ట్
-
Oct 15, 2025 18:51 IST
చిలకలూరిపేట దగ్గర హైవేపై రోడ్డుప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆక్సిజన్ సిలిండర్ల లారీ
బస్సులో 10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు
-
Oct 15, 2025 18:51 IST
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేత ఆశన్న
రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు లొంగిపోనున్న ఆశన్న
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న
-
Oct 15, 2025 18:51 IST
మంత్రి శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం
మెల్‌బోర్న్‌లో ఆస్‌బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్‌లో..
కీలకోపన్యాసం చేయనున్న మంత్రి శ్రీధర్‌బాబు
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మేక్‌గీచీ నుంచి ఆహ్వానం
-
Oct 15, 2025 18:51 IST
ఢిల్లీ: Xలో ప్రధాని మోదీ తెలుగు ట్వీట్
రేపు నేను ఏపీలో ఉంటాను: Xలో ప్రధాని మోదీ
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్ధానంలో ప్రార్థనలు చేస్తాను
కర్నూలులో రూ.13,400 కోట్లకుపైగా విలువైన..
అభివృద్ధి పనుల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను
ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ,..
పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు చెందినవి అంటూ తెలుగులో మోదీ ట్వీట్
-
Oct 15, 2025 18:51 IST
అక్షరమే ఆయుధంగా, సమాజ హితమే లక్ష్యంగా వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో..
వెలిగించిన ఆంధ్రజ్యోతి దినదిన ప్రవర్థమానమై 23 ఏళ్లు: మంత్రి లోకేశ్
నిజాన్ని నిర్భీతిగా చూపించడంలో దమ్మున్న ఛానల్‌గా పేరుగాంచిన..
ABN ప్రారంభమై 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్
హృదయాలను కదిలించే మానవీయ కథనాలు, అవినీతిపరుల పాలిట సింహ స్వప్నం లాంటి..
పరిశోధనాత్మక కథనాలు, నిక్కచ్చి రాజకీయ విశ్లేషణలతో..
తెలుగు వీక్షకులకు అభిమాన పత్రికగా ఆంధ్రజ్యోతి, ఇష్టపడే ఛానల్‌గా ABN నిలిచాయి
వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు: మంత్రి లోకేశ్
-
Oct 15, 2025 18:51 IST
కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది: మంత్రి ఉత్తమ్
నదీ జలాలు కాపాడే విషయంలో రాజీ లేకుండా పోరాటం: మంత్రి ఉత్తమ్
నది జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని వాదనలు వినిపించాం: మంత్రి ఉత్తమ్
పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో వరి సాగు: మంత్రి ఉత్తమ్
వానాకాలంలో 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది: మంత్రి ఉత్తమ్
-
Oct 15, 2025 15:52 IST
ఆంధ్రజ్యోతి 23వ వార్షికోత్సవం, ABN 16వ వార్షికోవత్సవం సందర్భంగా..
ఎండీ రాధాకృష్ణ, సిబ్బందికి, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
23 సంవత్సరాలుగా తెలుగు పాఠకులపై ఆంధ్రజ్యోతి చెరగని ముద్రవేసింది: చంద్రబాబు
16 సంవత్సరాలుగా విశిష్ట న్యూస్ ఛానల్‌గా ABN ఆంధ్రజ్యోతి వెలుగోందుతోంది
ఎండీ వేమూరి రాధాకృష్ణకు అభినందనలు: సీఎం చంద్రబాబు
-
Oct 15, 2025 15:52 IST
ఏపీలో నకిలీ మద్యం నివారణకు ప్రభుత్వం చర్యలు
వైన్స్, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు
నకిలీ మద్యం నివారణకు నిబంధనలు కఠినతరం చేసిన ఎక్సైజ్ శాఖ
ప్రతి మద్యం బాటిల్‌కు QR కోడ్ ద్వారా స్కానింగ్
ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా బాటిల్‌పై ఉన్న QR కోడ్ స్కాన్ తప్పనిసరి
వైన్స్, బార్ల దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశం
-
Oct 15, 2025 13:36 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులపై కేసు
క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు
సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్,..
సందీప్ త్యాగిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు
అండర్-19, అండర్-23 లీగ్‌లో ఆడించేందుకు..
డబ్బులు అడిగారని క్రీడాకారుల తల్లిదండ్రుల ఫిర్యాదు
-
Oct 15, 2025 13:36 IST
అమరావతి: మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన
టాటా గ్రూప్‌నకు చెందిన హిటాచి షోరూంను ప్రారంభించిన లోకేష్
గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే..
కూటమి ప్రభుత్వం అభివృద్ధికి వాడుతోంది: మంత్రి లోకేష్
-
Oct 15, 2025 13:35 IST
ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ సర్కార్
-
Oct 15, 2025 13:35 IST
నిజామాబాద్: శివాజీనగర్‌లో విషాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న బంధువులు
-
Oct 15, 2025 13:35 IST
జూబ్లీహిల్స్ ఎన్నికలో పోటీకి సిద్ధమైన RRR రైతులు
ఈనెల 20లోపు ప్రభుత్వం స్పందించకుంటే నామినేషన్లు వేస్తాం
మొత్తం 300 మంది నామినేషన్లు వేస్తామన్న RRR రైతులు
-
Oct 15, 2025 13:34 IST
హైదరాబాద్: బీజేపీ ఆఫీస్‌లో బీసీ సంఘం నేతల మధ్య వాగ్వాదం
ఈనెల 18న బంద్‌కు మద్దతు ఇవ్వాలని..
ఆర్. కృష్ణయ్యతో ఆఫీస్‌కు వచ్చిన బీసీ సంఘాల నేతలు
రాంచందర్‌రావుతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన బీసీ నేతలు
ఫొటోల విషయంలో బీసీ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట
రాంచందర్‌రావు, ఆర్.కృష్ణయ్య ఎదుటే బాహాబాహీ
-
Oct 15, 2025 13:34 IST
ప్రకాశం బ్యారేజీ, దివిసీమలో మరమ్మతులకు రూ.4.49 కోట్లు మంజూరు
గత ఏడాది వరదతో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేసేందుకు నిధులు
ప్రకాశం బ్యారేజీ గేట్లు, ఇతర మరమ్మత్తులకు రెండు కోట్లు మంజూరు
దివిసీమ ప్రాంతలో పలు కాలువల మరమ్మతులకు రూ.2.49 కోట్లు
-
Oct 15, 2025 13:34 IST
అమరావతి: శ్రీశైలంలో ప్రధాని మోదీ షెడ్యూల్
రేపు ఉ.9.50కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
ఉ.10.55కి శ్రీశైలం చేరుకోనున్న ప్రధాని మోదీ
భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకోనున్న మోదీ
-
Oct 15, 2025 12:43 IST
హైదరాబాద్: తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతీ(97) కన్నుమూత,
తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడిన బాల సరస్వతీ
-
Oct 15, 2025 12:29 IST
జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసింది: కవిత
కేసీఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదు: కల్వకుంట్ల కవిత
BRS నుంచి నా సస్పెన్షన్ కారణాలను విశ్లేషించుకున్నా: కల్వకుంట్ల కవిత
ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారు
సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా?: కల్వకుంట్ల కవిత
జాగృతి జనం బాట పేరుతో కవిత యాత్ర
కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేస్తా: కవిత
నా తొవ్వ నేను చూసుకుంటున్నా: కవిత
తెలంగాణ వ్యాప్తంగా 4 నెలల పాటు కవిత యాత్ర
-
Oct 15, 2025 12:21 IST
గత పాలకులు చేసిన విధ్వంసంతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది: చంద్రబాబు
గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టింది: చంద్రబాబు
యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశాం
ఇప్పుడు ప్రధాని పాల్గొనే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌ను సక్సెస్ చేద్దాం
రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం: చంద్రబాబు
గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు: చంద్రబాబు
తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం: చంద్రబాబు
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలి: చంద్రబాబు
ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మమర్దశ రాబోతోంది: సీఎం చంద్రబాబు
-
Oct 15, 2025 12:21 IST
అమరావతి: ప్రధాని మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు
డబులు ఇంజిన్ సర్కార్ విధానాలతో ఏపీకి అనేక ప్రయోజనాలు: సీఎం
కేంద్ర సహకారంతో ఏపీకి పెద్దఎత్తున లాభం చేకూరుతోంది: చంద్రబాబు
గూగుల్ డేటా హబ్ రావడంలో ప్రధాని, కేంద్రమంత్రుల చొరవ ఉంది
గూగుల్ రావడానికి మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు: చంద్రబాబు
15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకొచ్చింది: చంద్రబాబు
దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి: సీఎం చంద్రబాబు
-
Oct 15, 2025 12:20 IST
ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి నా కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడు
గత ఎన్నికల్లో రాఘవరెడ్డి పోటీ చేయాల్సి ఉంది: ఎంపీ మాగుంట
చంద్రబాబు ఆదేశాలతో నేనే పోటీ చేశా: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డి బరిలో దిగుతాడు: ఎంపీ మాగుంట
-
Oct 15, 2025 12:19 IST
ఢిల్లీ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు వివరణ
లిక్కర్ కేసు నిందితులతో సంబంధం లేకుండా చెవిరెడ్డి బెయిల్‌పై..
నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచన
మిథున్‌రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు..
మిగిలినవారి బెయిల్ పిటిషన్లపై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు
హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చెవిరెడ్డి
చెవిరెడ్డి బెయిల్‌పై విచారించి నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం
-
Oct 15, 2025 12:19 IST
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
లొంగిపోయిన మావోయిస్టులపై రూ.50లక్షల రివార్డు
-
Oct 15, 2025 11:25 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి
దీపక్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం
-
Oct 15, 2025 11:24 IST
నిజామాబాద్: కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు
జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
తెలంగాణలో దొంగ ఓట్లు తెచ్చిందే BRS పార్టీ: ఎంపీ ధర్మపురి అర్వింద్
బోధన్‌లో 42 దొంగ పాస్‌పోర్టులు ఇచ్చింది మరిచారా?: అర్వింద్
బంగ్లాదేశ్, మయన్మార్ దేశీయులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది BRS
జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా?: అర్వింద్
-
Oct 15, 2025 11:07 IST
జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్‌కిషోర్ సంచలన నిర్ణయం
బిహార్ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీ చేయను: పీకే
పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తా.. కానీ పోటీ చేయను: పీకే
పార్టీ ప్రయోజనాల కోసమే పోటీకి దూరం: ప్రశాంత్ కిషోర్
-
Oct 15, 2025 11:07 IST
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి సందర్భంగా 4 రోజుల పాటు అనుమతి
అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చన్న సుప్రీం
-
Oct 15, 2025 11:01 IST
మహారాష్ట్ర: మల్లోజులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు అప్పగింత
నిన్న 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయిన మల్లోజుల
మల్లోజుల వేణుగోపాల్‌రావుపై వందకు పైగా కేసులు
-
Oct 15, 2025 10:17 IST
అమరావతి: ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం: లోకేష్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయి
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది: లోకేష్
ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోంది: మంత్రి లోకేష్
డేటా సెంటర్ మాత్రమే కాదు.. అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి
విశాఖకు గూగుల్ రావడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది: లోకేష్
ఏపీలోని అన్ని జిల్లాల్లో కంపెనీలు ఏర్పాటు కానున్నాయి: లోకేష్
అమరావతికి క్వాంటం వ్యాలీ రానుంది: మంత్రి లోకేష్
గోదావరి జిల్లాల్లో డిఫెన్స్, ఆక్వా పరిశ్రమలు రానున్నాయి: లోకేష్
-
Oct 15, 2025 10:16 IST
రంగారెడ్డి: శంషాబాద్ మండలం పాలమాకులలో దారుణం
అబార్షన్ వికటించి యువతి మృతి, పరారీలో RMP పద్మజ
ప్రేమ పేరుతో యువతిని గర్భవతిని చేసిన హోంగార్డు మధుసూదన్
శంషాబాద్ పోలీస్ క్లూస్ టీంలో విధులు నిర్వహిస్తున్న మధుసూదన్
-
Oct 15, 2025 10:03 IST
హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు.
ఉప్పర్ పల్లి జన చైతన్య వెంచర్ సమీపంలో పార్కు స్థలం కబ్జా.
2 ఎకరాల భూమిని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.
ఈస వాగుకు ఆనుకొని ప్రభుత్వ స్థలంలో కబ్జా.
ఏకంగా ప్లాట్స్ ఏర్పాటు చేసిన కబ్జాదారులు.
భారీ బందోబస్తు నడుమ అక్రమ వెంచర్ లో కూల్చివేతలు.
-
Oct 15, 2025 09:50 IST
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు
అధికారికంగా ప్రకటించనున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
60 మంది మావోయిస్టులతో కలిసి నిన్న లొంగిపోయిన మల్లోజుల
మల్లోజుల వేణుగోపాల్‌రావుపై వందకు పైగా కేసులు
-
Oct 15, 2025 09:49 IST
నంద్యాల: శ్రీశైలం పాతాళగంగ సమీపంలో చిరుత మృతి
చిరుత మృతిపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు
ఇటీవల పాతాళగంగ మెట్ల మార్గంలో స్థానికులకు కనిపించిన చిరుత
-
Oct 15, 2025 09:33 IST
విజయవాడ: నకిలీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం
తాలూకా కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు
ఏ5 సయ్యద్ హాజీ, ఏ6 కట్టారాజు, ఏ9 మిథున్‌దాస్, ఏ10 దాస్‌పై పీటీ వారెంట్లు
ఏ1 జనార్దన్‌ను 10రోజుల కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ అధికారులు పిటిషన్
-
Oct 15, 2025 08:39 IST
గుంటూరు: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారయత్నం
చర్లపల్లి వెళ్తున్న రైలులో మహిళా భోగిలోకి ఎక్కిన దుండగుడు
ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బ్యాగ్, ఫోన్ లాక్కున్న నిందితుడు
అనంతరం మహిళపై అత్యాచారయత్నం
మహిళ కేకలు వేయడంతో పారిపోయిన దుండగుడు
-
Oct 15, 2025 08:39 IST
నేడు గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం
ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్న మంత్రి శ్రీధర్‌బాబు
-
Oct 15, 2025 08:12 IST
కామారెడ్డి: ఎల్లారెడ్డి పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
కాపాడేందుకు ఎల్లారెడ్డి హోంగార్డు ఆంజనేయులు విఫలయత్నం
చెరువులో నీటమునిగి గణేష్(48) మృతి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Oct 15, 2025 08:10 IST
కొమురంభీం: దహెగం మండలం బీబ్రా అటవీప్రాంతంలో పులి సంచారం
కొమురంభీం: ఆసిఫాబాద్ మండలం సల్పలగూడ భీమన్న ఆలయ పరిసరాల్లో పులి సంచారం
అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరిక
-
Oct 15, 2025 08:10 IST
బాపట్ల: గూగుల్ రాకతో ఐటీ రంగంలో విశాఖ గేమ్ ఛేంజర్‌గా మారిపోతుంది
విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: నక్కా ఆనందబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖకు అనేక ఐటీ కంపెనీలు తరలి వస్తున్నాయి
భవిష్యత్‌లో విశాఖ మెగా ఐటీ AI హబ్‌గా మారనుంది: ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
-
Oct 15, 2025 08:10 IST
బందీల మృతదేహాల విడుదల ఆలస్యంపై నెతన్యాహు ఆగ్రహం
బందీల మృతదేహాలు వచ్చే వరకు గాజాకు మానవతా సాయంపై వేటు
మానవతా సాయంలో సగాన్ని మాత్రమే అనుమతిస్తామని హెచ్చరిక
-
Oct 15, 2025 08:09 IST
ఇజ్రాయెల్ బందీల మృతదేహాల విడుదలలో జాప్యంపై ట్రంప్ అసహనం
ఒప్పందం ప్రకారం జరగాలని హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
మృతదేహాలను త్వరగా విడుదల చేయాలని ట్రంప్ సూచన
-
Oct 15, 2025 07:11 IST
ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె వాయిదా
2 రోజులపాటు సమ్మె వాయిదా వేస్తున్నట్లు జేఏసీ ప్రకటన
ప్రధాని పర్యటనతో సమ్మె తాత్కాలికంగా వాయిదా
17న చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్న విదుత్యు జేఏసీ
-
Oct 15, 2025 07:10 IST
విజయవాడ: ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్
లిక్కర్ కేసు నిందితులను కస్టడీకి కోరిన సిట్
-
Oct 15, 2025 07:10 IST
విజయవాడ: నకిలీ మద్యం కేసు
జనార్దన్‌రావు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
10 రోజుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్
-
Oct 15, 2025 07:09 IST
నేడు వరంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
MLA దొంతి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న రేవంత్
ఇటీవల MLA దొంతి మాధవరెడ్డికి మాతృవియోగం
-
Oct 15, 2025 07:09 IST
రేపు కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
మోదీ సభ కోసం 3,070 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు
మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
కడప, అనంతపురం, బళ్లారితో పాటు..
ఆత్మకూరు నుంచి వచ్చే వాహనాలు దారి మళ్లింపు
-
Oct 15, 2025 07:09 IST
భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై విజయ్ మల్యా విమర్శలు
తన ఆస్తుల వివరాలు వెల్లడించడం బ్యాంకులు ఆపేశాయని ఆగ్రహం
-
Oct 15, 2025 07:08 IST
జమ్మూ: భారత్‌తో నేరుగా తలపడేంత సామర్థ్యం పాకిస్థాన్‌కు లేదు
పహల్గాం తరహాలో మరో దాడికి పాల్పడవచ్చు: వెస్టర్న్ ఆర్మీ కమాండర్
-
Oct 15, 2025 07:08 IST
నోబెల్ అవార్డు ఎంపికపై భగ్గుమన్న వెనుజువెలా
నార్వేలో తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనుజులా ప్రకటన
-
Oct 15, 2025 07:07 IST
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మాగంటి సునీత
మాగంటి సునీతతో పాటు.. కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం
ఈనెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్
-
Oct 15, 2025 07:07 IST
హైకోర్టుకు బీఆర్ఎస్ .
జూబ్లీహిల్స్ నియోజకర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయంటోన్న బీఆర్ఎస్
నకిలీ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారికి పిర్యాదు చేసి 24గంటలు అవుతున్న స్పందన లేదంటోన్న బీఆర్ఎస్
నేడు హైకోర్టు తలుపు తట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం
నకిలీ ఓట్లు తొలగించాలని హైకోర్టుకు బీఆర్ఎస్ లీగల్ టీం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 23వేల ఓట్లు పెరగడంపై అనుమానాలకు తావిస్తుందంటోన్న బీఆర్ఎస్.
-
Oct 15, 2025 06:12 IST
పలాసలో అర్ధరాత్రి హైడ్రామా..
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి హైడ్రామా..
తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పొలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన మాజీ మంత్రి అప్పలరాజు.
మద్యంపై నిరసనలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై స్థానిక వైసీపీ నాయకుడు వేణుగోపాల్ అసభ్య ప్రవర్తన.
ర్యాలీలో మహిళా కానిస్టేబుల్ మెడపై చేయి వేసి లాగిన వేణుగోపాల్ రెడ్డి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.
తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ అర్ధరాత్రి అప్పలరాజు హంగామా.
జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి..