Share News

Relationship Rules by Chanakya : చాణక్యుడి ప్రకారం.. భాగస్వామితో ఈ 5 విషయాల్లో నోరు జారితే.. సంసార జీవితం నరకమే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:27 PM

Relationship Rules from Chanakya Niti : చాణక్య నీతి ప్రకారం, పెళ్లి తర్వాత సంతోషకరమైన జీవితం గడపాలంటే ఈ 5 విషయాలను తన జీవిత భాగస్వామికి చెప్పకుండా దాచడమే మంచిది. మీరు పొరపాటున ఈ విషయాలను పంచుకున్నారంటే భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అర్థం..

Relationship Rules by Chanakya : చాణక్యుడి ప్రకారం.. భాగస్వామితో ఈ 5 విషయాల్లో నోరు జారితే.. సంసార జీవితం నరకమే..
Chanakya Niti's Relationship Mantras

Relationship Rules from Chanakya Niti : ప్రతి బంధానికి బలమైన పునాదులు ప్రేమ, నమ్మకాలే. ఈ లక్షణాలు లేకుంటే జీవితభాగస్వామితో కలిసి సుఖంగా జీవించలేరు. అయితే, చాలా మంది తమ భాగస్వామితో రోజువారీ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలా చేస్తే జీవితాంతం సంతోషంగా ఉండగలరని అనుకుంటారు. నిజానికిది మంచి అలవాటు కాదని సూచిస్తున్నాడు చాణుక్యుడు. ఆయన చెప్పిన ప్రకారం సంతోషకరమైన జీవితం కోసం ఈ 5 విషయాలను తన జీవిత భాగస్వామి దగ్గర దాచడమే మంచిది. మీరు మీ సంబంధాన్ని బలంగా ఉంచుకోవాలనుకుంటే.. అనవసరమైన రోజువారీ తగాదాలను నివారించాలనుకుంటే.. ఈ 5 విషయాలను మీ భాగస్వామికి పొరపాటు కూడా చెప్పకండి..


ఈ 5 విషయాలను మీ భాగస్వామితో పంచుకోకూడదు..

1. ఒత్తిడిని కలిగించే విషయాలు..

మీ భాగస్వామితో ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవడం వల్ల మీ సంతోషకరమైన జీవితంలో సమస్యలు తలెత్తుతాయని తెలిస్తే.. దానిని చెప్పకుండా ఉండటమే తెలివైన పని. చాణక్య నీతి ప్రకారం, తెలివైన వ్యక్తి తన భాగస్వామితో ప్రతిదీ పంచుకోకూడదు. ఇది అనుసరిస్తే మీ ఇద్దరిపై ఒత్తిడి, ఆందోళన ఉండదు. తద్వారా మీ మధ్య ప్రేమ, బాంధవ్యాలు చెడిపోకుండా నిలిచే ఉంటాయి.


2. గత జ్ఞాపకాలు..

ప్రతి సంతోషకరమైన సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మీ గతానికి సంబంధించిన అనవసరమైన విషయాలను భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ సంబంధంలో సమస్యలు ఏర్పడవచ్చు. నిజాయితీ నిరూపించుకోవాలని గత వ్యవహారాల గురించి భాగస్వామికి చెప్తే వారికి అభద్రతా భావాన్ని కలిగించిన వారవుతారు. అందుకే గతానికి సంబంధించిన విషయాలను మరచిపోయి కొత్త సంబంధంపైనే దృష్టి పెట్టడం మంచిది.

3. వ్యక్తిగత విషయం..

మీ బంధువులలో ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా సమస్య లేదా పెద్ద రహస్యాన్ని మీతో పంచుకుంటే.. దానిని మీ భాగస్వామికి చెప్పకండి. ఒకవేళ మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విషయం బయటపడవచ్చు. అప్పుడు మీరు వారి అతడు/ఆమె నమ్మకాన్ని కోల్పోవచ్చు.


4. తల్లిదండ్రుల దుర్మార్గం..

మీ భర్త పని నుండి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీరు అతడి తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడినా లేదా విమర్శించినా అతడు దానిని తేలికగా తీసుకుంటాడని మీరు అనుకుంటే పొరపాటే. ఎవరూ వారి తల్లిదండ్రులపై విమర్శలు వినడానికి ఇష్టపడరు. నిజంగా ఏదైనా పెద్ద సమస్య ఉంటే మీ భర్త మానసిక స్థితి, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని దాని గురించి మాట్లాడండి.

5. అనుమానం ఆధారంగా విమర్శించవద్దు..

కొన్నిసార్లు దంపతుల మధ్య కలిగే అనుమానాలు అందమైన సంబంధానికి మధ్య గోడ కడతాయి. అందుకే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానం ఆధారంగా మీ భాగస్వామిని నిందించకండి. వారిని దోషిగా చూడటం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.


Read also : CM Stalin: మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న సీఎం.. కారణమిదే..

France : వైద్యం ముసుగులో కామపిశాచం.. 299 మంది రోగులపై అత్యాచారం చేసిన దుర్మార్గుడు.. ఎక్కడంటే..

ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు సాయం.. పథకమేంటో

మరిన్ని తెలుగు, ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 07:39 PM