Share News

CM Stalin: మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న సీఎం.. కారణమిదే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:20 PM

జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా హిందీని తమపై రుద్దుతున్నారనే ఆరోపణలపై కేంద్రం, తమిళనాడు సీఎం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని అమలు చేయడానికి మేము అనుమతించబోమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

CM Stalin: మరో భాషా యుద్ధానికి సిద్ధమన్న సీఎం.. కారణమిదే..
tamilnadu CM Stalin

జాతీయ విద్యా విధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM Stalin) మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఇటీవల తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో స్టాలిన్ నిరాకరించడంపై విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బలవంతంగా దీనిని అమలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రం హిందీని తమపై రుద్దుతోందని వ్యాఖ్యానించగా, ఈ ఆరోపణను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.


దీంతో కొత్త విద్యా విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం క్రమంగా పెరుగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక ప్రకటన చేశారు. తమ రాష్ట్రం మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను రాజకీయం చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన కీలకమైన నిధులను నిలిపివేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ఈ క్రమంలో తమిళనాడులో కొత్త విద్యా విధానాన్ని స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.


2 వేల కోట్ల రూపాయల కోసం మన హక్కులను వదులుకోలేమని స్టాలిన్ ఈ సందర్భంగా అన్నారు. మనం అలా చేస్తే, తమిళ పాలన 2000 సంవత్సరాల వెనక్కి వెళుతుందన్నారు. కొత్త విద్యా విధానం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని, తమిళ భాషకు ప్రమాదం వాటిళ్లేలా చేస్తుందన్నారు. ఇది మన పిల్లల భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదని, కానీ తమపై ఏదైనా భాషను రుద్దితే ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు. తమిళనాడు కుటుంబ నియంత్రణ కార్యక్రమం ద్వారా జనాభాను నియంత్రించింది. తమిళనాడులో జనాభా తక్కువగా ఉంది కాబట్టి, లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మేము దాదాపు ఎనిమిది సీట్లు కోల్పోతామన్నారు స్టాలిన్. ఆ తర్వాత మాకు 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం పార్లమెంటులో తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు


Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 25 , 2025 | 07:21 PM