Best Adventours Spots: హార్ట్‌బీట్ స్పీడ్ పెరిగే ట్రిప్‌కి రెడీనా.. ఇండియాలోని టాప్ 6 అడ్వెంచర్ డెస్టినేషన్స్ ఇవే..
ABN, Publish Date - Apr 17 , 2025 | 03:09 PM
Best Adventours Spots In India: భారతదేశంలో చూడాలని అనుకోవాలనే గానీ లెక్కలేనన్ని పర్యాటక ప్రాంతాలున్నాయి. సెలవుల్లో టూర్ ని కూల్ గా ఎంజాయ్ చేయాలని కొందరనుకుంటే.. థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఫీలింగ్ కావాలని డేర్ చేసేవాళ్లు కొందరుంటారు. సెలవుల్లో రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధమైతే.. ఇండియాలో ఈ ప్రాంతాలను చుట్టేయండి మరి..
1/7
వేసవి సెలవుల్లో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కావాలని కోరుకునేవారు ఇండియాలో ఉండే ఈ టాప్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఇక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్స్ సాహసయాత్రికులకు అద్భుతమైన అనుభవాలను అందిస్తాయి.
2/7
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ వైట్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ కు ప్రసిద్ధి. భారతదేశంలోనే ఎత్తైన బంగీ జంప్ 83 మీటర్లు ఇక్కడే చేయగలరు. రిషికేశ్ గంగానదిపై థ్రిల్లింగ్ వైట్-వాటర్ రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలకు ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, ఆధ్యాత్మిక వైబ్ స్పెషల్ అసెట్
3/7
హిమాచల్ ప్రదేశ్ మనాలిలో పారాగ్లైడింగ్, స్కీయింగ్ చాలా ఫేమస్. మనాలి శీతాకాలపు క్రీడలు, వైమానిక సాహసాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా సోలాంగ్ వ్యాలీ, స్కీయింగ్, స్నోబోర్డింగ్, పారాగ్లైడింగ్ లకు ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య ఈ సాహసయాత్రలు చేసేందుకు దేశవిదేశీ పర్యాటకులు క్యూ కడతారు.
4/7
జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్-లడఖ్ రోడ్లపై మోటార్ బైకింగ్, ఎత్తైన ప్రదేశాల్లో ట్రెక్కింగ్ యువతకు మహా ఇష్టం. కఠినంగా ఉండే భూభాగం, ఎత్తైన ప్రదేశాలు, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు ఆస్వాదిస్తూ బైక్ పై దూసుకుపోతుంటారు. రివర్ రాఫ్టింగ్‌కు కూడా ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి.
5/7
అండమాన్ నికోబార్ దీవులలో స్ఫటికం కంటే స్వచ్ఛమైన జలాలు, పగడపు దిబ్బలు ఉన్నాయి. వీటిలో ఉండే వైవిధ్యమైన జీవజాలంలో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ చేస్తే భలేగా ఉంటుంది. ప్రత్యేకించి హావ్‌లాక్ ద్వీపం స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, నీటి అడుగున ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది.
6/7
రాజస్థాన్‌లో ఎడారులలో ఒంటె సఫారీలు, క్వాడ్ బైకింగ్, డూన్ బాషింగ్ వంటి వివిధ రకాల సాహసాలు చేయవచ్చు.
7/7
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయలో ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయడమంటే సాహస యాత్రికులకు చాలా మక్కువ. మౌంటెన్ బైకింగ్ కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావనను పెంచడంతో పాటు శారీరక శ్రమను కలిగించి మనసును, దేహాన్ని తేలికపరుస్తుంది.
Updated at - Apr 17 , 2025 | 03:11 PM