Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు..

ABN, Publish Date - Oct 18 , 2025 | 01:44 PM

తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ కొనసాగుతున్న వేళ.. నగరాలు, పట్టణాలలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలో మద్దతు తెలపడంతో.. బంద్ ప్రశాతంగా కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 1/7

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బీసీ బంద్ కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బంద్‌‌కు మద్దతు తెలిపారు. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 2/7

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వనపర్తి జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపో వద్ద వివిధ పార్టీ సంఘాల నాయకులు బైఠాయించారు. అనంతరం పలు ప్రధాన రహదారులు చౌరస్తాల వద్ద బైక్ ర్యాలీలో ధర్నాలు చేపట్టారు.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 3/7

యాదాద్రి భువనగిరి జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్ కొనసాగుతోంది. దీంతో యాదగిరిగుట్ట డిపోలకే బస్సులు బంద్ పరిమితం అయ్యాయి.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 4/7

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బైఠాయించారు. బీసీ బంద్‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు మద్దుతు తెలుపుతూ.. నిరసన వ్యక్తం చేశారు.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 5/7

బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద బీసీ నాయకులు నిరసన తెలిపారు. బంద్ కారణంగా ఎంజీబీఎస్‌లో బస్సులో నిలిపివేయడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడ్డారు.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 6/7

సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బస్‌ డిపో వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.

Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు.. 7/7

42 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని భూపాలపల్లి జిల్లాలో బీసీ నాయకులు ఆందోళన చేపట్టారు. బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టారు.

Updated at - Oct 18 , 2025 | 01:52 PM