నిజామాబాద్‌లో రైతు మహోత్సవం సభ.. పాల్గొన్న మంత్రులు
ABN, Publish Date - Apr 22 , 2025 | 06:48 AM
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం సభ జరుగుతోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కొనసాగనుంది.
1/23
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం సభ జరుగుతోంది.
2/23
ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
3/23
మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కొనసాగనుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఈ సభలో ప్రదర్శిస్తున్నారు.
4/23
రైతు మహోత్సవం సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
5/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులు
6/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన పసుపు పంట ఉత్పత్తులు
7/23
రైతులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శింస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు
8/23
అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
9/23
వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారాన్ని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
10/23
రైతులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శింస్తున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
11/23
రైతులకు వివిధ పంట ఉత్పత్తుల గురించి వివరిస్తున్న అధికారులు
12/23
రైతు మహోత్సవం సభలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
13/23
రైతు మహోత్సవం సభకు హెలీకాప్టర్‌లో మంత్రులు వచ్చారు. ఈ సమయంలో గాలిదుమారంతో సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలాయి. దీంతో కొద్దిసేను గందరగోళం నెలకొంది.
14/23
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
15/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వివరాలు తెలుసుకుంటున్న అధికారులు
16/23
రైతు మహోత్సవం సభలో అన్నదాతలతో మాట్లాడుతున్న అధికారులు
17/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన మామిడికాయలకు సంబంధించిన స్టాల్
18/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు
19/23
రైతు మహోత్సవం సభలో ఏర్పాటు చేసిన మామిడికాయల ఉత్పత్తులు
20/23
రైతులతో మాట్లాడుతున్న అధికారులు
21/23
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు నిర్మించి ఉంటే.. నిజామాబాద్ జిల్లా రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
22/23
నిజాం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
23/23
రైతు మహోత్సవం సభలో పాల్గొన్న రైతులు
Updated at - Apr 22 , 2025 | 07:40 AM