KTR: భోగి వేడుకల్లో కేటీఆర్ సందడి
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:13 PM
తెలుగు పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పల్లెల్లో సందడి కనిపిస్తుంది. మూడు రోజుల పండుగ సంబరంగా సాగుతుంది. సంక్రాంతికి ఒక్క రోజు ముందొచ్చేది భోగి. భోగి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు.

తెలుగు పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పల్లెల్లో సందడి కనిపిస్తుంది. మూడు రోజుల పండుగ సంబరంగా సాగుతుంది. సంక్రాంతికి ఒక్క రోజు ముందొచ్చేది భోగి. భోగి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు.

గొబ్బి దేవతకు స్వాగతం పలుకుతూ పల్లె పడుచులు గొబ్బి పాటలు, భోగి మంటలతో నిండైన సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి శుక్రవారం నుంచే సెలవులు ఉండడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పల్లెలకు చేరుకుంటుండడంతో సందడి నెలకొంటోంది.

తెలుగు ప్రజలందరికీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి భోగ భాగ్యాలు తీసుకురావాలని ఆశిస్తున్నానని కేటీఆర్ అన్నారు.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు.

వారితో పాటు మాజీ మంత్రి సబితా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, పట్లోల్ల కార్తీక్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Updated at - Jan 13 , 2025 | 01:33 PM